క్రైమ్

Crime : నాడు ప్రియుడి కోసం.. నేడు అదే ఇంజెక్షన్‌తో నర్సు దారుణం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను కడతేర్చిన ఓ యువతి ..తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది.పేరెంట్స్‌ను ఎలాగైతే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిందో అదే విధంగా సదరు యువతి సైతం తనకు తాను ఇంజెక్షన్ తీసుకుని మరణించినట్టు సమాచారం.

ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను కడతేర్చిన ఓ యువతి ..తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది.పేరెంట్స్‌ను ఎలాగైతే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిందో అదే విధంగా సదరు యువతి సైతం తనకు తాను ఇంజెక్షన్ తీసుకుని మరణించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పేరెంట్స్‌ను కాదని ప్రియుడి కోసం ఇదంతా చేస్తే నిందితురాలిగా తేలడంతో సమాజంతో పాటు బంధువులు, కుటుంబసభ్యులు సైతం ఆమెను దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న సురేఖ.. నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నప్పుడు సురేఖ ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే.. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో, వారిపై పగ పెంచుకున్న సురేఖ.. ఇదే ఏడాది జనవరిలో.. వికారాబాద్‌లోని యాచారంలో పేరెంట్స్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది.

అనంతరం అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోయినట్టు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోస్టుమార్టంలో ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతో చనిపోయారని తేలింది.దీంతో కూతురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో సురేఖనే తల్లిదండ్రుల్ని చంపిందని నిర్దారించారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

https://x.com/pulsenewsbreak/status/2091686174301794685?s=20

ఇదిలాఉండగా, బెయిల్ మీద బయటకు వచ్చిన సురేఖ తిరిగి సంగారెడ్డికి వచ్చింది. సంగారెడ్డి శాంతినగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఆమె .. ఏం జరిగిందో తెలీదు కానీ తల్లిదండ్రులను చంపిన మత్తు ఇంజెక్షన్‌తోనే సురేఖ సైతం బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

#nurse suicide#overdose injection#self inject#sangareddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి