సినిమా

RC17: త్రివిక్రమ్, సుకుమార్‌లలో ఈ మార్పు ఎందుకు?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

RC17: టాలీవుడ్‌లో ఇప్పుడు రెండు క్రేజీ కాంబినేషన్స్ గురించి అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ కాంబినేషన్సే త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్‌టిర్, సుకుమార్-రామ్ చరణ్. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో.. అనేదే అందరిలో జరుగుతున్న చర్చ. అయితే, సుకుమార్-చరణ్ ల ఆర్సీ 17 ఈ దసరాకి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

RC17: టాలీవుడ్‌లో ఇప్పుడు రెండు క్రేజీ కాంబినేషన్స్ గురించి అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ కాంబినేషన్సే త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్‌టిర్, సుకుమార్-రామ్ చరణ్. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో.. అనేదే అందరిలో జరుగుతున్న చర్చ. అయితే, సుకుమార్-చరణ్ ల ఆర్సీ 17 ఈ దసరాకి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక, త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి, ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ చెయ్యాల్సింది. కానీ, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో, కాస్త ఈ సినిమాపై నెగిటివ్ గా కూడా కొందరు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.

అయితే, నిన్నా మొన్నటి వరకూ సుకుమార్ చేయబోతున్న సినిమా పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ అని..చరణ్ ని మరోసారి రంగస్థలం సినిమాలోని చిట్టి బాబు పాత్రకంటే భిన్నంగా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కంటే విభిన్నంగా చూపించబోతున్నాడని..విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం మేరకు సుకుమార్ కూడా గురూజీ మాదిరిగా చరణ్ కోసం మైథలాజికల్ స్టోరీని రెడీ చేసినట్టుగా తెలుస్తోంది.

ఫక్తు కమర్షియల్ సినిమాలను పక్కన పెడుతున్న డైరెక్టర్స్:

ఈ మధ్య కాలంలో చూసుకుంటే మైథలాజికల్ సినిమాలనే హీరోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకాలం, మాస్ అండ్ యాక్షన్ సినిమాలను పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందించిన దర్శకులు ప్రశాంత్ వర్మ మాదిరిగా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను తీయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఎన్‌టిర్ తో త్రివిక్రమ్ చేయబోయో సినిమా సుబ్రమణ్య స్వామీ కథతో రూపొందనుంది. సుకుమార్ కూడా చరణ్ కోసం ఇలాంటి జానర్ నే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. చూడాలి, మరి ఇది ఎలాంటి కంటెంట్‌తో రూపొందబోతుందో.

#Sukumar#Ram Charan#RC 17#Tollywood#Trivikram Srinivas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి