National

CEC: దేశవ్యాప్తంగా రగులుతున్న ఎస్ఐఆర్ రగడ! సీఈసీ రాజీనామా చేయకతప్పదా?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

CEC: భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంలా రగులుతోంది. ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానితుల జాబితాలో నెట్టేయడం, సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణకు తెరతీయడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సీఈసీ రాజీనామా అస్త్రం సంధించాయి.

CEC: భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంలా రగులుతోంది. ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానితుల జాబితాలో నెట్టేయడం, సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణకు తెరతీయడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సీఈసీ రాజీనామా అస్త్రం సంధించాయి. వ్యవస్థల స్వయంప్రతిపత్తికే సవాలుగా మారిన ఈ సంక్షోభంలో సీఈసీ తన పదవికి రాజీనామా చేయకతప్పదా అనే పరిస్థితి నెలకొందా అనే చర్చ సర్వత్రా మొదలైంది.

క్షేత్రస్థాయిలో ‘ఎస్ఐఆర్’ వికృత రూపం..

ఓటర్ల జాబితాను సరిచేయాల్సిన ప్రక్రియ కాస్తా పౌరుల ఓటు హక్కును హరించే స్థాయికి దిగజారిందన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. 'షిఫ్టెడ్, ఆబ్సెంట్' పేరుతో ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానాస్పద జాబితాలో చేర్చడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది.

స్వల్ప కారణాలకే ఓటర్ల ఇళ్లకు చాంతాడంత నోటీసులు పంపడం, మూడు తరాల ఎనిడెన్స్‌లు చూపించాలంటూ బీఎల్వోలు ఒత్తిడి తేవడం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఢిల్లీలోని వీఐపీలు, దశాబ్దాలుగా ఓటు హక్కు యూజ్ చేసుకుంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, చివరికి న్యాయమూర్తుల పేర్లు కూడా జాబితాల నుంచి గల్లంతవడం ఎస్ఐఆర్ డొల్లతనాన్ని నడిరోడ్డుపై నిలబెట్టినట్లు అయ్యింది.

సీఈసీపై 14 అభ్యంతరాల ముద్ర

ఈ వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యక్తిగతంగా బోనెక్కడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాల శైలి అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో గానీ, కనీసం మెజారిటీ కమిషనర్ల సపోర్ట్‌తో పనిచేయాలన్న రాజ్యాంగ సూత్రానికి గండిపడింది.

తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. ఎస్ఐఆర్ మార్గదర్శకాలు, వివాదాస్పద 'ఫార్మ్-6' సవరణలపై కనీసం 14 సందర్భాల్లో లిఖితపూర్వకంగా అభ్యంతరాలు నమోదు చేసినప్పటికీ, సీఈసీ వాటిని బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు రుద్దారని ఆధారాలు వెలుగుచూశాయి. రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థను స్వప్రయోజనాలకు అనుగుణంగా మార్చేశారనే ఆరోపణలు సీఈసీ పదవికే మచ్చగా మారాయి.

సుప్రీంకోర్టు విచారణ..

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో న్యాయస్థానం సీఈసీ తీరుపై అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్ బాగ్చి స్పందిస్తూ.. కమిషనర్ల ఆమోదం లేకుండా సీఈసీ ఒక్కరే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు రికార్డుల్లో తేలితే వాటిని తక్షణమే రద్దు చేసి తీరతామని తేల్చిచెప్పారు.

పౌరులను ఓటు ఉన్నవారు, ఓటు లేనివారు అంటూ విభజించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ మూలతత్వాన్నే దెబ్బతీస్తుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేసిన కామెంట్స్ ఈ వ్యవహారంలో ఈసీ వైఖరిని నైతికంగా ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.

రాజీనామా దిశగా ఒత్తిడి..

ఓటు హక్కు కల్పించే బాధ్యత కలిగిన రాజ్యాంగ సంస్థే కోట్లాది మంది ఓట్లను హరించే అస్త్రంగా మారిందన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా ఉంది. విపక్షాలు ఇప్పటికే దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తూ సీఈసీ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఫార్మ్-6 రికార్డులను సమర్పించాల్సి ఉండగా, అంతర్గతంగా తోటి కమిషనర్లు వ్యతిరేకించిన నిజాలు రికార్డుల ద్వారా న్యాయస్థానం ముందు బయటపడితే సీఈసీ రాజీనామా చేయడం లేదా న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవడం అనివార్యంగా కనిపిస్తోంది.

వ్యక్తుల కంటే రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతే ముఖ్యమని తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. 13 కోట్ల మంది పౌరుల ప్రజాస్వామ్య హక్కును కాపాడటమే కాకుండా, ఎన్నికల సంఘంపై ప్రజల్లో నమ్మకం నిలబడాలంటే సీఈసీ తన పదవి నుంచి తప్పుకోవడమే ఏకైక పరిష్కారమన్న డిమాండ్ ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కుదిపేస్తోంది.

#CEC#Chief Election Commissioner#Election Commission of India#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి