Oman Coast: ఒమన్ సమీపంలోని హర్మూజ్ జలసంధిలో పనామా ఫ్లాగ్‌తో వెళ్తున్న ఓ కార్గో షిప్‌ను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. ఈ దాడిలో షిప్‌లో పనిచేస్తున్న 11 మంది భారతీయ క్రూ మెంబర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (MEA) అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.
ఒమన్ కోస్ట్‌గార్డ్ ఎమర్జెన్సీ రెస్క్యూ
దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ మారిటైమ్ అథారిటీస్, కోస్ట్‌గార్డ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇండియన్ క్రూ మెంబర్స్‌ను షిప్ నుంచి సేఫ్‌గా ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం లోకల్ హాస్పిటల్స్‌లో వారికి ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. టైంకి రియాక్ట్ అయ్యి మనవాళ్ల ప్రాణాలు నిలబెట్టిన ఒమన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం థాంక్స్ చెప్పింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
నౌకలో 17 మంది మనవాళ్లే!
ఈ షిప్‌లో మొత్తం 19 మంది సిబ్బంది డ్యూటీలో ఉండగా, అందులో 17 మంది భారతీయులే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ 3న కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన రాకెట్ దాడిలో ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలతో బయటపడగా, అంతకుముందు సెప్టెంబర్‌లో జరిగిన మరో దాడిలో ఒక భారతీయ నావికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దాడులు వెంటనే ఆపండి: భారత్ వార్నింగ్
నిరాయుధులైన కార్గో షిప్‌లు, అమాయక సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో షిప్‌లు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే హక్కును ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం పక్కా రూల్స్‌ని బ్రేక్ చేయడం అని పేర్కొంటూ.. ఇలాంటి దాడులను వెంటనే బంద్ చేయాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది.


