సినిమా

Rawindra Pulle: అప్పుడే నా మైసా(రష్మిక) దొరికింది!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Rawindra Pulle: టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rawindra Pulle: టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా రష్మికను ఇప్పటివరకు చూడని విధంగా రఫ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో చూపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

కథ రాస్తున్నప్పుడే రష్మికను ఫిక్స్ చేశా!

‘మైసా’ గురించి ఇటీవ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు రవీంద్ర పుల్లె.. ఈ కథ రాస్తున్న సమయంలోనే రష్మికను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ‘సీతారామం’ చిత్రానికి పనిచేసిన సమయంలోనే రష్మికను తన తదుపరి సినిమాకు హీరోయిన్‌గా ఊహించుకున్నానని చెప్పారు. సీతారామం లో ఉన్న ఓ ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేసిన రవీంద్ర..రష్మిక పర్ఫార్మెన్స్ చూసి నా మైసా ఈమె..అని ఫిక్సైయ్యాడు.

ఇక, ఇప్పటివరకు ప్రేక్షకులు రష్మికను క్యూట్, స్వీట్ పాత్రల్లో ఎక్కువగా చూశారని.. కానీ, ‘మైసా’లో మాత్రం ఆమెను పూర్తిగా భిన్నమైన అవతార్‌లో చూస్తారని రవీంద్ర ఆసక్తికరంగా చెప్పారు. ముఖ్యంగా సినిమాలో రష్మిక ముఖంపై రక్తంతో కనిపించే సన్నివేశాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు. దీంతో, సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

‘మైసా’లో రష్మిక గోండ్ గిరిజన మహిళ పాత్రలో కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్టుగా ఆమె తనను తాను పూర్తిగా మార్చుకున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అడవులు, కొండలు, జలపాతాలు, నీటి అడుగున సన్నివేశాలు ఇలా చాలా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లలో రష్మిక స్వయంగా పాల్గొన్నట్లు చెప్పాడు దర్శకుడు. దాదాపు 25 అడుగుల లోతున్న పాండ్‌లో షూటింగ్ జరిపారట. ఆ సమయంలో కూడా డూప్ కాకుండా స్వయంగా రష్మికనే ఈ సీన్స్‌లో యాక్ట్ చేసిందని చెప్పాడు రవీంద్ర.

ఇక, రష్మిక కూడా ఇటీవల మైసా సినిమా గురించి చెప్తూ.. ఈ సినిమా తనకు పూర్తిగా కొత్త అనుభవమని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కువగా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టిన తాను.. ‘మైసా’లో తొలిసారి ఇంత భారీ స్థాయిలో యాక్షన్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం గంటల తరబడి నీటిలో ఉండాల్సి వచ్చిందని, షూటింగ్ సమయంలో గాయాలు కూడా అయ్యాయని ఆమె తెలిపారు. మొత్తానికి, ఈ సినిమా రష్మిక కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదని అర్థమవుతోంది.

#Rawindra Pulle#Mysaa#Rashmika Mandanna#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి