National

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక తీర్మానాలు

రచన: NK•••4 నిమిషాల పఠనం

ఎన్నికల సంఘం వివాదంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ), డీకే శివకుమార్ (కర్నాటక), సతీశన్ (కేరళ), సుఖ్విందర్ సింగ్ (హిమాచల్ ప్రదేశ్) పాల్గొన్నారు.

CWC: ఎన్నికల సంఘం వివాదంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ), డీకే శివకుమార్ (కర్నాటక), సతీశన్ (కేరళ), సుఖ్విందర్ సింగ్ (హిమాచల్ ప్రదేశ్) పాల్గొన్నారు. వీరితో పాటు విద్యాశాఖ మంత్రులు, ఏఐసీసీ ఇంఛార్జ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సంఘం వివాదంపై మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. సీఈసీ జ్ఞానేశ్​కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 కీలక తీర్మానాలు

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఎన్నికల సంఘంలో అభిప్రాయభేదాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం 5 కీలక తీర్మానాలు చేసింది.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వెంటనే చేయాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. తక్షణమే సర్ ప్రక్రియను నిలిపివేయాలని తీర్మానం చేసింది. తొలగించిన 13 కోట్ల 30 లక్షల పేర్లను ఓటర్ల జాబితాలో పునరుద్ధరించాలంది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పుల డేటాను తక్షణమే బహిరంగపరచాలంది. ఎన్నికల్లో అక్రమాలు వెలుగుచూసిన చోట స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల వ్యవస్థను కాపాడుకునేందుకు పార్లమెంటు, కోర్టులు, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని ప్రకటించింది.

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటాలు చేస్తామని వెల్లడించింది.

#CWC#Congress Working Committee#Election Commission#Gyanesh Kumar#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి