Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ రంగంలోకి హోస్ట్‌గా అడుగుపెట్టబోతున్నారని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు, ఈ టాక్ షో కోసం చిరంజీవికి ఏకంగా 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఒక్కో సినిమాకి 70 కోట్లు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కమిటైన సినిమాలకి గానూ ఒక్కో సినిమాని 70 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకరవప్రాద్‌గారు సినిమాకి 70 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే, రెమ్యునరేషన్ ఇప్పుడు చేస్తున్న కాకా సినిమాకి అందుకుంటున్నారట.
ప్రస్తుతం, చిరు చేతిలో కాకా.. విశ్వంభర సినిమాలున్నాయి. కాకా చిత్రాన్ని బాబీ తెరకెక్కిఉన్నాడు. 2027, జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ఇక, విశ్వంభర మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. వీటి తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను చిరు కమిటైయ్యాడు. త్వరలో, ఈ సినిమా అప్‌డేట్ కూడా రానుంది.
ఇలా, వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న మెగాస్టార్..ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోతున్న ఒక గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా చేసేందుకు ఒప్పుకున్నారట. నాగార్జున, బాలయ్య ఇలా టాక్ షోస్‌తో బాగానే సంపాదిస్తున్నారు. ఆ జాబితాలో చిరు కూడా చేరనున్నాడని తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా రూపుదిద్దుకోనున్న ఈ షో కోసం చిరంజీవికి ఏకంగా రూ. 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.


