సినిమా

Trivikram: ఎన్టీఆర్ మూవీపై ఇట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనుంది. వీరి కాంబినేషన్‌లో సెట్స్ పైకి రాబోయో ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి, ఈ సినిమాకి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇక, ఈ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ స్వయంగా తాజాగా కీలకమైన అప్డేట్ ఇచ్చారు.

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది. అక్టోబర్ 9న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది.

ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో రెడీగా ఉందని త్రివిక్రమ్ తెలిపారు. అయితే, ఇన్ని రోజుల నుంచి వార్తల్లో ప్రచారం అవుతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ అన్న టైటిల్ మాత్రం పెట్టలేదట. తాజాగా, గురూజీ ఈ ప్రాజెక్ట్‌కు టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని కూడా రివీల్ చేశారు.

దీంతో ఈ ప్రాజెక్ట్‌కు టైటిల్ ‘గాడ్ ఆఫ్ వార్’ అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇక, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలతో పాటు, అధికారిక టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, ఇంకా స్క్రిప్ట్ దశలో ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా తప్పని అర్థమైంది. ఆదర్శ కుటుంబం రిలీజైయ్యాక ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టనున్నారని క్లారిటీ వచ్చింది.

#trivikram srinivas#ntr#tarak#ntrivikram#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి