Ranabaali: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న సినిమాల్లో ‘రణబాలి’ కూడా ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ దశలోనే ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది చిత్రబృందం. ఇక, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. రణబాలి సినిమా కోసం వేసిన భారీ సెట్స్ నుంచే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా, మేకర్స్ దీనికి సంబందించిన క్రేజీ అప్‌డేట్స్‌ను ఎక్స్ ద్వారా వెల్లడించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించగా, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇక, ఈ సినిమాను అక్టోబర్ 16న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ప్రారంభించారు.
పీరియాడిక్ సినిమా కావడంతో, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ భారీ సెట్స్‌ని వేయించాడు. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథ కావడంతో అప్పటి పరిస్థితులను, పాత్రలను, జీవన విధానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించబోతున్నాడని..ఇటీవల వచ్చిన టీజర్‌తోనే అర్థమైంది. ఇక, విజయ్ పోషిస్తున్నటువంటి రణబాలి పాత్ర..రష్మిక పోషిస్తున్న జయమ్మ పాత్రలు సినిమాకి ప్రధాన బలం అని ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతోంది.
ఇక, తాజాగా మేకర్స్ ఎక్స్ ద్వారా ప్రేక్షకులకి షేర్ చేసిన సెట్ పిక్స్ చూస్తుంటే ఒక కొత్త ప్రపంచాన్నే రణబాలి సినిమా కోసం నిర్మించినట్టుగా అర్థమవుతోంది. గత కొన్నేళ్ళ నుంచి విజయ్‌కి హిట్ దక్కలేదు. రష్మిక ఖాతాలో మంచి హిట్స్ చేరాయి. నిర్మాణ సంస్థ మైత్రీ వరుస హిట్స్‌తో అంచలంచలుగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు కావాల్సిందల్లా సాలీడ్ విజయ్ దేవరకొండకే. ఆ సాలీడ్ హిట్ రణబాలి మూవీతో ఆశిస్తున్నాడు. చూడాలి, మరి ఏం జరుగుతుందో.


