Dharman: సూపర్‌స్టార్ రజినీకాంత్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే మన టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇందులో విలన్‌గా నటిస్తున్న విషయం కన్‌ఫర్మ్ అయింది.
ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైసూర్ షెడ్యూల్‌లో రామ్, రాశీ ఖన్నా ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. అంతేకాదు, రజినీ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడు. ఇక, ఈ మైసూర్ షెడ్యూల్ విశేషాలను తెలుపుతూ హీరోయిన్ రాశీ షేర్ చేసిన లేటెస్ట్ ఫిట్‌నెస్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
మైసూర్‌లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాశీ ఖన్నా ఉదయాన్నే వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా. రజినీకాంత్.. రామ్ పోతినేనితో కలిసి ఆమె మార్నింగ్ వర్కౌట్స్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రజినీకాంత్ వయసును సైతం లెక్కచేయకుండా తన ఫిట్‌నెస్ విషయంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారనే విషయం తెలిసిందే. మరోవైపు రామ్ పోతినేని కూడా తన సినిమాల కోసం లుక్, ఫిజిక్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటుంటారు. అలాంటి ఇద్దరు స్టార్స్‌తో కలిసి రాశీ ఖన్నా వర్కౌట్స్ చేయడం ఇప్పుడు ‘ధర్మన్’ టీమ్‌లో ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఇక, జిమ్ దుస్తుల్లో ఉన్న ఈ లేటెస్ట్ ఫొటోకు రాశీ ఖన్నా ఒక సరదా క్యాప్షన్ ను కూడా జత చేసింది. “రజినీ సర్, రామ్‌లతో తెల్లవారుజామునే వర్కౌట్స్.. అసలు లోకమంతా నిద్రలేచే సమయానికి ముందే మా రోజు మొదలవుతుంది” అంటూ కామెంట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుత, రాశీ షేర్ చేసిన పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాను అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. 2027, సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.


