క్రైమ్

Crime : ఓయోలో యువతి అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఓయో హోటల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో గల గోకుల్ ప్రైడ్‌ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అంతకుముందు సీ గణేశ్ పేరుతో గోకుల్ ప్రైడ్‌లో యువతి, యువకుడు రూమ్ నం.103 తీసుకున్నట్టు హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఓయో హోటల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో గల గోకుల్ ప్రైడ్‌ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అంతకుముందు సీ గణేశ్ పేరుతో గోకుల్ ప్రైడ్‌లో యువతి, యువకుడు రూమ్ నం.103 తీసుకున్నట్టు హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, తెల్లారేసరికి యువతి అనుమానాస్పద మృతి చెందగా.. యువకుడు కనిపించలేదు. అయితే, ఆ రాత్రి ఏం జరిగింది? ఆ యువకుడే యువతిని హత్యచేశాడా? అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఉదయం హోటల్ సిబ్బంది వెళ్లే సరికి గది తలుపులు తెరిచి ఉండటం, అందులో యువతి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆధార్ కార్డులో యువతి పేరు ‘దుర్గ’అని ఉందని గుర్తించారు. ఇదిలాఉండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు మృతురాలి పేరు ‘శిరీష’ అని ఉందని కూడా గుర్తించారు. అయితే, మృతురాలిని భర్త కొట్టడంతో ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. మెడికల్ బిల్స్ ఆధారంగా ఈ వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.ఇదిలాఉండగా, ఈ ఘటనకు ముందు మరో యువతి మాదాపూర్‌లోని ఓయో (OYO) హోటల్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే.విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల యువతి షారోన్ నిఖిత.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ మద్యం బాటిళ్లతో దాడి చేసి చంపినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అంతకుముందు విశాఖపట్నానికి చెందిన నిఖిత, రవితేజ సెప్టెంబర్ 21న మాదాపూర్ సిద్ధిఖీనగర్‌లోని ఒక ఓయో హోటల్‌లో గది నంబర్ 303 తీసుకున్నారు. ఆ రాత్రి మద్యం సేవించిన రవితేజను.. నిఖిత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మద్యం బాటిళ్లతో తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు.అనంతరం ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. కాగా, ఓయో రూముల్లో యువతుల వరుస మరణాలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

#oyo room#women died#hyderabad#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి