తెలంగాణ

BRS : కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దలను వదిలేసి పేదల ఇళ్లు, భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దలను వదిలేసి పేదల ఇళ్లు, భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడంగల్‌లో ఇండ్లు కోల్పోయిన బాధితుల పక్షాన హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడంగల్ బిడ్డను అంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు.

మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అంటూ మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అని అడిగారు. ‘న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా?ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుండి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు.

అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? పోలీసులను అడ్డుపెట్టుకుని బుల్డోజర్ రాజ్ అమలు చేస్తారా?పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన? యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గొప్పగా చెప్పుకునే భూసేకరణ చట్టం–2013 ప్రకారం బాధితులకు తక్షణం న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరులో రోడ్ల విస్తరణ (మద్దూరు - చింతలదిన్నె రోడ్డు విస్తరణ ప్రాజెక్టు) కోసం ప్రభుత్వం పేదప్రజల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగానే మద్దూరు ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనుల కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా సుమారు 84 ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో తొలగించారు.కాగా, కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్నాయ వసతి లేదా పరిహారం ప్రకటించకుండానే రాత్రికి రాత్రే ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#kodangal#poorpeople#houses shops#demolished#swechaanews#harish rao
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి