సినిమా

Pooja Hegde: ఐటమ్ సాంగ్స్‌లో కూడా నో ఛాన్స్!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పుడు వరుసగా సినిమాలు, స్పెషల్ అప్పియరెన్స్‌ల విషయంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారా? ఇదే ఇప్పుడు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన సమయంలో.. కనీసం స్పెషల్ సాంగ్స్ ద్వారా అయినా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతారని భావించిన అభిమానులకు తాజా పరిణామాలు కొంత నిరాశ కలిగిస్తున్నాయి.

స్పెషల్ సాంగ్స్ కూడా చేజారుతున్నాయా?

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, రెమ్యునరేషన్ ఒక కారణం అయితే, నానితో కీర్తికి ఉన్న స్పెషల్ బాండింగ్ వల్ల ఆ సాంగ్‌లొ కీర్తి సురేష్ వచ్చి చేరింది. నాని-కీర్తి సురేష్ చేసిన ‘యేశా నాగుల’ అనే మాస్ సాంగ్‌ సినిమాకి మంచి హైప్ తీసుకువచ్చింది.

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాన్ర్ నటించిన కూలీ సినిమాలో ఉన్న మోనిక సాంగ్ వల్ల పూజాకి బాగా పేరొచ్చింది. కనైఇ, జైలర్ లో మాత్రం ఈసారి స్పెషల్ నంబర్ లో పూణ కనిపించింది. వాస్తవానికి, ఈ సాంగ్ కోసం కూడా పూజా పేరు పరిశీలించిన తర్వాత పూర్ణను ఎంచుకున్నారట. హీరోయిన్‌గా అవకాశాలు బాగానే తగ్గాయి. ఇలాంటి, సమయంలో స్పెషల్ సాంగ్స్ అయినా వచ్చిపడితే పూజాను జనాలు మర్చిపోరు.

పూజా కెరీర్ పూర్తిగా డౌన్‌లో ఉందా?

పూజా కెరీర్ పూర్తిగా డౌన్‌లో ఉందా అంటే అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం సినిమాలేమి లేని హీరోయిన్ కాదు. 2026లో ఆమె ‘జన నాయగన్’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఆమెకు కీలకమైన ప్రాజెక్ట్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక, ఇటీవలే,‘శ్రీ శ్రీ’ కోసం పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్‌తో కలిసి విదేశీ షెడ్యూల్‌లోనూ పాల్గొంది. టాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల వరకూ వచ్చి ఆగిపోతున్నాయి. మరి, సాలీడ్ కంబ్యాక్ ఎప్పుడిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

#Pooja Hegde#Tollywood Actress#Sri Sri#Cinema Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి