Aadarsha Kutumbam: మన టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. కుటుంబ కథాంశానికి తనదైన కామెడీ, ఎమోషన్‌ను జోడించి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసే పనిలో మేకర్స్ బిజీ అయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వెంకీ–త్రివిక్రమ్–శ్రీనిధి స్పెషల్ ఇంటర్వ్యూస్ మొదలు పెట్టారు.
తాజాగా, ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజై బాగా వైరల్ అవుతోంది. ఫుల్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఏ సినిమాకైనా ప్రమోషన్స్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆదర్శకుటుంబం నుంచి ప్రమోషనల్ కంటెంట్ కావాలని కోరుతున్నారు. అందుకే, ముందుగా వెంకీ–త్రివిక్రమ్–శ్రీనిధి స్పెషల్ ఇంటర్వ్యూస్ మొదలు పెట్టింది చిత్ర నిర్మాణ సంస్థ.
‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. తాజాగా, నారాయణమ్మ సాంగ్ రిలీజై యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే, హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రత్యేక ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. సీనియర్ యాంకర్ సుమ వీరితో ఇప్పటికే, ఓ స్పెషల్ ఇంటర్వ్యూను పూర్తి చేసింది. ఈ ఇంటర్వ్యూల్లో సినిమా విశేషాలతో పాటు తమ పాత్రలు, షూటింగ్ అనుభవాలు, కథ ఎంపికకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోనున్నట్లు తాజాగా వదిలిన ప్రోమో ద్వారా అర్థమవుతోంది.
వెంకీ సినిమాల్లో కామెడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మరోవైపు త్రివిక్రమ్ అంటే కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, పంచ్ డైలాగ్స్‌కు మంచి పేరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇంటర్వ్యూల్లో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక, గతంలో వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, త్రివిక్రమ్ దర్శకత్వకంలో ఆదర్శక కుటుంబం రూపొందుతోంది.


