తెలంగాణ

BJP : రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

‘పేదోళ్ల దేవుడు శివుడు.. ఉన్నోళ్ల దేవుడు రాముడు’ అందుకే బీజేపీ వాల్లు పదే పదే జై శ్రీరాం అంటారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాము పేదల వైపు ఉంటే బీజేపీ సంపన్నుల వైపు ఉందని వ్యాఖ్యానించారు.

‘పేదోళ్ల దేవుడు శివుడు.. ఉన్నోళ్ల దేవుడు రాముడు’ అందుకే బీజేపీ వాల్లు పదే పదే జై శ్రీరాం అంటారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాము పేదల వైపు ఉంటే బీజేపీ సంపన్నుల వైపు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ‘సైమన్ గో బ్యాక్’ అని నినదించి దేశమంతా ఏకమైనట్టు ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’​ గోబ్యాక్ అని నినదిస్తూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

తాము హరహర మహాదేవ్ అని అంటే బీజేపీకి నచ్చడంలేదని, వారు జై శ్రీరామ్ అనడానికే మొగ్గు చూపుతున్నారన్నారు. అభివృద్ధి నిధుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది అని కాకుండా ‘గుజరాత్ వర్సెస్ దేశం’ అన్నట్టుగా ఉందన్నారు.ఇదిలాఉండగా, శివుడు పేదల దేవుడు,రాముడు ధనికుల దేవుడు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు.

సోనియా గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి ప్రజలను విడగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని మంచి డాక్టర్‌కు చూపించాలని సెటైర్లు వేశారు. సౌత్, నార్త్ అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను అవమానించడమే వెల్లడించారు.

దేవుడిపై నమ్మకంలేకపోతే సైలెంట్‌గా ఉండాలని కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారని దేవుళ్లను అవమానించకూడదని హితవు పలికారు. ఖైరతాబాద్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మీరు హిందూ దేవుళ్లకు పూజలు చేయపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ముఖ్యమంత్రికి బీజేపీ స్టేట్ చీఫ్ హితవు పలికారు. ఎక్కడపడితే అక్కడ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, మరి దాని గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

#bjp state cheif ramchandar rao#revanth reddy#bjp#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి