The Paradise: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేసిన సినిమా కావడంతో మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, సినిమాపై ఎంతటి హైప్ ఉందో.. అదే స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. అయితే, సినిమా రిలీజైయ్యాక మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? దాన్ని అందుకోవడం అంత ఈజీనా? అనే చర్చ మొదలైంది.
‘ది ప్యారడైజ్’ సాధారణ కమర్షియల్ సినిమా కాదనే విషయం ప్రేక్షకుల ముందుకు వచ్చాక స్పష్టమైంది. శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమా ‘దసరా’తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. మరోవైపు నాని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ కాంబినేషన్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది.
సినిమా స్కేల్, కంటెంట్, నాని ఇమేజ్, దర్శకుడి క్రేజ్ కలిపి ‘ది ప్యారడైజ్’ 100 కోట్లకి పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెప్పుకున్నారు. అయితే, ఇప్పటి వరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ 150 కోట్లకి చేరుకుందని తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే 50 కోట్ల వసూళ్ళు రాబట్టిందట. వాస్తవానికి, ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది. కానీ, సెకండాఫ్ ఉన్నంత బలంగా ఫస్టాఫ్ లేదనే టాక్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది. దాంతో, ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గిందని చెప్పాలి. అయినా కూడా వసూళ్ల పరంగా మాత్రం అంత డిసప్పాయింట్ చేయలేదు. మండే టెస్ట్ కూడా నాని బృందం పాసైనట్టుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
షేర్ లెక్కలో గనక చూసుకుంటే 81 కోట్ల వరకూ వసూళ్ళు రాబట్టింది. ఇంకా దాదాపు 21 కోట్ల వరకూ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక్కడే ప్యారడైజ్ సినిమాకి పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. మండే నుంచి కలెక్షన్స్ బాగా తగ్గినట్టుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ వారంలో గనక బ్రేకీవెన్ కాకపోతే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు తప్పవని అంటున్నారు. చూడాలి, మరి నానీస్ ప్యారడైజ్ బ్రేకీవెన్ అవుతుందా లేదా.


