సినిమా

Rajinikanth: జైలర్ 2 నుంచి ప్రమోషన్స్ షురూ

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Rajinikanth: సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయి. ‘జైలర్ 2’ షూటింగ్, నిర్మాణ పనులు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

అక్టోబర్ 15న భారీ స్థాయిలో జైలర్ 2 రాబోతుండగా..అక్టోబర్ 5న ఈ ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేశారు. ‘జైలర్’లో రజినీకాంత్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ చూపించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, యాక్షన్, రజినీ స్టైల్ కలిసి సినిమాకు ప్రత్యేకమైన ఫీల్ ను తీసుకొచ్చాయి. అందుకే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక, ఇప్పుడు ఆ స్థాయిని మరింత పెంచే కథతో సీక్వెల్ ని రూపొందించారు.

దీంతో ఈసారి రజినీకాంత్ పాత్ర ఎలా ఉండబోతుంది? విలన్స్ ఎవరు? ‘జైలర్’తో ఉన్న లింక్ ఏమిటి? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ​అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో "శివగామి" రమ్యకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటి విద్యాబాలన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. మోహన్‌లాల్, హృతిక్ రోషన్, శివ రాజ్‌కుమార్, విజయ్ సేతుపతి ఇతర ప్రత్యేక పాత్రల్లో సందడి చేనున్నారు.సూపర్ స్టార్ సినిమాతో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పోటీకి దిగుతున్నాడు. ఒక్కరోజు తేడాతో రజినీ-విజయ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.

రజినీకాంత్ నటించిన జైలర్ 2 అక్టోబర్ 15న రిలీజ్ కానుండగా..విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా..రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా రణబాలి అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. రజినీకాంత్ ఈ మధ్య చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధిస్తున్నాయి. జైలర్, గత చిత్రం కూలీ ఎలాంటి కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయో అందరికీ తెలిసిందే. కానీ, విజయ్‌కి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పుడు, రణబాలి సినిమాపైనే విజయ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. చూడాలి మరి ఏ మేరకు రణబాలి విజయ్‌కి సక్సెస్‌ని ఇస్తుందో.

#Rajinikanth#Jailer 2#Nelson Dilip Kumar#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి