తెలంగాణ

TG : మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండి : హైకోర్టు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఈనెల 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు, బీఆర్ఎస్ చట్టసభ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. స్లోగన్స్ రాసి ఉన్న నల్లటి దుస్తులు, ప్లకార్డులు పట్టుకుని సభలోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది.

ఈనెల 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు, బీఆర్ఎస్ చట్టసభ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. స్లోగన్స్ రాసి ఉన్న నల్లటి దుస్తులు, ప్లకార్డులు పట్టుకుని సభలోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు, మహిళా శాసనసభ్యులకు మధ్య తోపులాట జరిగింది. అయితే, తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు తన చీర లాగారని ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి పోలీసులు లాగినట్టు విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు అటు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముందుగా ఫిర్యాదు చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ..తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పోలీసులపై తీసుకునే చర్యల రిపోర్టును స్పీకర్ ముందు ఉంచాలని సూచించింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని హైకోర్టు తేల్చిచెప్పినట్టు సమాచారం. గతంలో ఇదే కేసు విచారణలో భాగంగా.. శాసనసభ లోపలికి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉంటుందని జస్టిస్ టి మాధవిదేవి స్పష్టం చేశారు.

"మహిళా ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక సీనియర్ మహిళా ఎమ్మెల్యే మెడపై చెయ్యి వేసి నెట్టడం, చీర లాగడం వంటి చర్యలు ఎంతవరకు సమంజసం?" అని కోర్టు ప్రశ్నించింది. ఇదిలాఉండగా, బాధిత మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తమతో పోలీసులు అసభ్యంగా, కర్కశంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వారు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), జాతీయ మహిళా కమిషన్ (NCW)లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, కోర్టు ఆదేశాల మేరకు డీజీపీ ఎటుంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

#women mla#police#attack#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి