వ్యాపారం

పండుగ‌కు ముందే మండుతున్న ప‌ప్పుధాన్యాల ధ‌ర‌లు.. నెల‌రోజుల్లో 11శాతం పెంపు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా పండుగ‌లు స‌మీపిస్తున్న వేళ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు పెను భారంగా మారుతున్నాయి. రాబోయే ద‌స‌రా, దీపావళి పండగల‌ను దృష్టిలో ఉంచుకుని ఇళ్లలో నిల్వలు పెంచుకుంటున్న తరుణంలో కీలకమైన పప్పుధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (IPGA) గణాంకాల ప్రకారం గత కొన్ని వారాల్లోనే శనగ, కంది, పెసర, బఠాణీ వంటి నిత్యావసర పప్పుల హోల్‌సేల్ ధరలు ఏకంగా 11 శాతం వరకు పెరగడం మార్కెట్‌లో కలకలం రేపుతోంది.

గత నెల రోజుల్లోనే అత్యధికంగా వినియోగించే శనగపప్పు ధర 11 శాతం పెరగ్గా, పెసరపప్పు 10.6శాతం, కందిపప్పు 6.5శాతం, బఠాణీ 6 శాతం మేర ప్రియమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే శనగపప్పు ధర 23 శాతం, బఠాణీ 47 శాతం, మినప్పప్పు 24 శాతం అధికంగా ఉన్నాయి. సోమవారం నాటి రిటైల్ మార్కెట్ సగటు ధరలను పరిశీలిస్తే కిలో శనగపప్పు రూ.88.72, కందిపప్పు రూ.125.72, పెసరపప్పు రూ.112.14, మసూర్ పప్పు రూ.90.43గా నమోదయ్యాయి. పండగ పూట ఈ స్థాయిలో ధరలు పెర‌గ‌డం సగటు గృహిణి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

ఈ ధరల పెంపు వెనుక బలమైన సరఫరా లోపాలు, వాతావరణ ఆందోళనలు ఉన్నాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా పప్పుధాన్యాలు పండించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వానాకాలం సాగు దిగుబడిపై ప్రభావం పడింది. రాబోయే యాసంగి సీజన్‌లో నేలలో తేమ తగ్గడం, ఎల్ నినో ప్రభావం శనగ సాగుపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా భారత్‌కు శనగ సరఫరా చేసే ఆస్ట్రేలియాలో పంట దిగుబడి తగ్గడం, రష్యా నుంచి పసుపు బఠాణీ దిగుమతులు మందగించడం కూడా ధరల మంటకు ప్రధాన కారణాలుగా మారాయి.

అయితే గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రికార్డు స్థాయిలో 274.09 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి జరగడంతో పాటు ప్రభుత్వం వద్ద 45 లక్షల టన్నుల బఫర్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం తక్షణ కొరత లేనప్పటికీ, భవిష్యత్తులో సరఫరా తగ్గుతుందన్న వ్యాపారుల అంచనాలతోనే మార్కెట్‌లో కృత్రిమ ఒత్తిడి పెరుగుతోంది. రానున్న రోజుల్లో పండగ డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం తమ బఫర్ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి ధరలను అదుపులోకి తీసుకురావాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

#PulsePriceHike#InflationIndia#BusinessNewsTelugu#PulsesPrices#DiwaliShopping#IPGA#APFinanceNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి