స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

కొంగరఖుర్దులో అక్రమ లేఅవుట్ల కలకలం.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దు గ్రామంలో భూకబ్జా యత్నాలు, అక్రమ లేఅవుట్ల వ్యవహారంపై బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న భూములకు నకిలీ ఓఆర్‌సీ (ORC) పత్రాలు, ఫోర్జరీ సంతకాలు సృష్టించి విక్రయాలకు తెగబడుతున్న కబ్జాదారులపై పోలీసులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.

  • నకిలీ ఓఆర్‌సీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో దందా

  • తెలుగు రికార్డులను ఇంగ్లిష్‌లోకి మారుస్తూ పేర్ల మార్పిడి

  • కోర్టుల్లో 500 కేసులు పెండింగ్‌లో ఉన్నా ఆగని అక్రమాలు

  • బాధితులపైనే ఎదురు క్రిమినల్ కేసులు నమోదు చేసి వేధింపులు

  • లేఅవుట్ అనుమతుల వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలకు డిమాండ్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దు గ్రామంలో భూకబ్జా యత్నాలు, అక్రమ లేఅవుట్ల వ్యవహారంపై బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న భూములకు నకిలీ ఓఆర్‌సీ (ORC) పత్రాలు, ఫోర్జరీ సంతకాలు సృష్టించి విక్రయాలకు తెగబడుతున్న కబ్జాదారులపై పోలీసులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలోనే ఈ అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు తాజాగా కేసు నమోదు చేసి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

కొంగరఖుర్దుతో పాటు రాయ్‌కోట, కొంగర రావిరాల పరిధిలోని సర్వే నంబర్లు 85 నుంచి 89 వరకు ఉన్న భూములపై కొందరు దళారులు, భూకబ్జాదారులు కన్నువేశారని బాధిత రైతులు రాంరెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సపమిరెడ్డి ఆరోపించారు. స్థానికంగా తెలుగులో ఉన్న పాత రెవెన్యూ రికార్డులను ఇంగ్లిష్‌లోకి అనువదించే సమయంలో రైతుల పేర్లను అక్రమంగా మార్చేశారని తెలిపారు. తప్పుడు పత్రాల ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి, ప్లాట్లను అమాయకులకు విక్రయిస్తూ భారీ మోసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.1992లోనే త‌మ‌కు ఓఆర్‌సీ ప‌త్రాలు ఉన్నాయ‌ని చెప్తున్నా ఆ ప‌త్రాల ఆధారంగా భూసేక‌ర‌ణ ప‌రిహారం ఎందుకు చెల్లించ‌లేద‌ని బాధితులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ భూ వివాదాలు ఇప్పటికే హైకోర్టుతో పాటు పలు న్యాయస్థానాల్లో 500 కేసుల వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో భూసేకరణ జరిగినప్పుడు, వివాదాస్పద భూములకు సంబంధించిన పరిహారాన్ని కోర్టులోనే డిపాజిట్ చేశారని గుర్తుచేశారు. సర్వే నంబర్లు 85 నుంచి 89 వరకు కేవలం 6 ఎకరాల 1 గుంట భూమి మాత్రమే భూసేకరణ పరిధిలోకి రాగా, అధికారులు దాదాపు 50 ఎకరాలకు అనుమతులు ఇచ్చారని సమాచారం ఉందన్నారు. తమ భూములను రక్షించుకోవడానికి రెండు గెజిట్లను రద్దు చేయాలని కోరుతూ తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వివరించారు.

తమ భూముల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు కబ్జాదారులు తమపైనే ఎదురు క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేధింపులకు గురిచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిభట్ల పిఎస్ లో కేసు నమోదు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వం, రెవెన్యూ శాఖ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. తప్పుడు ఓఆర్‌సీ పత్రాలు, లేఅవుట్ అనుమతుల వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుని, తమ భూ హక్కులను కాపాడి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

#KongarakhurdLandIssue#AdibatlaPS#MaheshwaramLandGrabbing#HMDAIllegalLayouts#RangareddyRealEstate#TelanganaNews#HyderabadLandDispute
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి