తెలంగాణ

TG : ఎల్‌నినో ఎఫెక్ట్.. కిలో రూ.80 దాటిన బియ్యం ధర

రచన: Kumar••4 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావమే కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావమే కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆరు తడి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వాలు, వ్యయసాయ నిపుణులు రైతులకు సూచించారు.దీంతో ఈ ఏడాది వరి దిగుబడి గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి.

వర్షాలు కురవకపోయినా రైతులు మాత్రం ధాన్యం సాగుకే అధికప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.అయితే, ఈసారి వరుసాగు దిగుబడి తగ్గుతుందని తెలుస్తుండగా.. మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. మూడు నెలల్లో కిలో బియ్యంపై రూ.15-20 పెరుగుదల నమోదైనట్టు సమాచారం. సన్నబియ్యం ప్రస్తుతం మార్కెట్లో రూ.70, నాణ్యమైన బియ్యం రూ.80కి పైగా ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.

ఎల్‌నినో కారణంగా దేశంలో బియ్యం ఉత్పత్తి 5-7 శాతం తగ్గే అవకాశం ఉన్నట్టు సమాచారం. సరఫరా తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. డిమాండకు తగ్గ సరఫరా లేనందువల్లే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.మార్కెట్లో సాధారణ, సన్న బియ్యం రకాలను బట్టి 25 కేజీల రైస్ బ్యాగ్ ధర ₹1,200 నుంచి ₹1,600 వరకు (రకాన్ని బట్టి ₹1,800 దాటి) పలుకుతోందని పేర్కొన్నారు.

ఎల్‌ నినో కారణంగా సకాలంలో వర్షాలు పడకపోవడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గగా.. ఇది రాబోయే రోజుల్లో దిగుబడిని దెబ్బతీస్తుందనే ఆందోళనలు పెరగడం కూడా ధరలు పెరగడానికి మరో కారణం. ఇక ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు (MSP) భారీగా ధాన్యాన్ని సేకరిస్తోంది. దీనివల్ల బహిరంగ మార్కెట్లో మిల్లు యజమానులకు, ప్రైవేట్ వ్యాపారులకు లభించే ధాన్యం నిల్వలు తగ్గిపోయాయి.

ఇంధన (ఫ్యూయల్), ఎరువులు, రవాణా ఖర్చులు పెరగడం కూడా బియ్యం రేట్లు పెరగడానికి మరో కారణమని అంటున్నారు.మున్ముందు ధరలు ఇంకా పెరుగుతాయనే భయంతో వినియోగదారులు, వ్యాపారులు ముందస్తుగా బియ్యాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవడం..మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు హోల్‌సేల్ వ్యాపారులు, మిల్లు యజమానులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం కూడా ధరలు పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది.

#rice#price hike#Elnino effect#telugu states#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి