క్రైమ్

YoutuberMadhumitha: ఇంట్లో రూ.కోటి చోరీ జరిగిన క్షణాల్లోనే రీల్స్.. యూట్యూబర్ మధుమిత తీరుపై నెటిజన్లు షాక్‌!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమిత ఇంట్లో భారీ దొంగతనం జరిగినప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు చోరీకి గురైన కొద్ది గంటల్లోనే ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయి దాదాపు కోటిన్నర వ్యూస్‌ను సాధించడం గమనార్హం.

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణంలో మధుమిత తన భర్త వినోద్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటోంది. గరువారం సాయంత్రం తమ పాప పుట్టినరోజు దుస్తుల కొనుగోలు కోసం కుటుంబంతో కలిసి తిరునల్వేలికి వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. కోటి విలువైన 118 సవర్ల బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు మరియు నగదు దొంగిలించినట్లు గుర్తించి రాజాకమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్పీ అన్షుల్ నగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. విచారణలో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మధుమిత తన సోషల్ మీడియా ఖాతాలలో తరచూ కేజీల కొద్దీ బంగారు నగలు, నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ వీడియోలు పెట్టడం, అలాగే కుటుంబ సమేతంగా బయటకు వెళ్తున్న సమయాలను లైవ్ పోస్టుల ద్వారా తెలియజేయడమే దొంగలకు సులువుగా సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఇంట్లో కోటి రూపాయల చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే మధుమిత ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా 10 రీల్స్ పోస్ట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తలపై డబ్బు కట్టలు పోసుకుని డ్యాన్స్ చేయడం, నోట్లను గాల్లోకి చల్లుతూ "ఏదీ శాశ్వతం కాదు" అనే క్యాప్షన్లతో వీడియోలను పంచుకుంది. కేవలం 40 గంటల వ్యవధిలోనే ఒక వీడియోకు 39 లక్షల వ్యూస్ రావడంతో పాటు మొత్తం మీద 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి, ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా 5 లక్షలకు చేరింది. దొంగతనం జరిగినా ఆమె ప్రవర్తిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం, విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

#YoutuberMadhumitha#MadhumithaBurglary#TamilNaduNews#InstagramReelsViral#KanyakumariCrime#SocialMediaInfluencer#CrimeNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి