- ఆసియాలోనే అత్యంత విలువైన, వివాదస్పదమైన 240 ఎకరాలు
- ఏడాది క్రితం ఓ బడా ఫార్మా కంపెనీ ఎంట్రీతో మారిన సీన్?
- గ్రీన్ కో డీల్ చేసిన పొన్నుగొంటి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు
- నెలకో తీరుగా మారుతున్న సుప్రీంకోర్టు తీర్పులు?
- డీమార్కేషన్ కంటిన్యూ అంటే చుట్టూ రేకులు పాతేస్తున్న వైనం?
- కొత్త కొత్త లిటిగేషన్స్‌తో ఎంట్రీ అవుతున్న కొత్త కొత్త టీమ్స్?
- కాంగ్రెస్ సర్కార్‌లోనే ఖతం పట్టించేలా ప్లాన్ గీస్తున్న పెద్దలు?
- ఎవరి వాటాపై వారు ధీమా?
- పాతికకు పైన సివిల్ కేసులు.. 100కు పైగా లిటిగేషన్స్.. వెయ్యికి పైగా డాక్యుమెంట్లు ఉన్న తేనెతుట్టెను కదుపుతున్న తీరుపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
కూకట్ పల్లి సర్వే నెంబర్ 1007కు కొత్తగా రేకులు పాతి బౌండరీ ఫిక్స్ చేస్తున్నారు. ప్రైం ప్రాపర్టీకి చెందిన ఆస్తులు అగ్రిమెంట్ చేసుకున్న గ్రీన్ కో అండ్ టీం అంతా నడిపిస్తోంది. ఈ టీంలో కీ రోల్ పోషించిన పొనుగొంటి శ్రీనివాసరావుపై ఏడాది క్రితం 5 కేసులు నమోదు అయ్యాయి. నిత్యం సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ భూములపై ఏదో ఒక విచారణ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆసియాలోనే అత్యంత వివాదాస్పద భూములుగా వీటిని చెప్పవచ్చు. అలాగే అత్యంత విలువైన భూమిగా భావిస్తారు. 240 ఎకరాలు కాగా ఎకరం 300 కోట్లు అని చెప్పినా కళ్లు మూసుకుని కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్ ఆస్తి కావడంతో ఎన్నో లిటిగేషన్స్ వచ్చి పడ్డాయి.
కొత్త వాదనలతో ఎంట్రీ ఇచ్చిన బడా ఫార్మా కంపెనీ?
మీర్ హషీమ్ అలీ పేరిట ఉన్న రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం.707/1952 చెల్లుబాటు కావాలంటే ఓవరాల్‌గా చెబితే సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. కానీ, సాక్షులు లేరని తెలిపారని అనుమానాలు లేవనెత్తారు. అదే చట్టం ప్రకారం రాతపూర్వకంగా, పొజిషన్‌లో ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుతుందని లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చారు. దీంతో వలీ మహమ్మద్‌కు ఇచ్చిన హిబాకే చట్టబద్దత లేదు. ఇక సేల్ డీడ్ ఎలా చేస్తారని చెబుతున్నారు.
హైదరాబాద్ టెనెన్సీ అగ్రికల్చర్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 47 (1) ప్రకారం ఏదైనా స్థిరాస్తి బదులాయించే ముందు తాలుక్‌దారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని లేకపోతే సెక్షన్ 50(బీ) ప్రకారం ఆ బదులాయింపును క్రమబద్దీకరణించుకోవాలని చెబుతున్నారు. 1969 వరకు సెక్షన్ 47 సజీవంగా ఉందని వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులు, హైకోర్టు తీర్పులను ఉటంకిస్తున్నారు.
1952 సేల్ డీడ్ కాబట్టి రిజిస్ట్రేషన్ డీడ్ అయినా వాస్తవంలో అనేక లోపాలున్నాయని ఫైల్ ప్రిపేర్ చేశారు. మీర్ హాషీమ్ ఆలీకి ఎలాంటి హక్కులు లేవని చెబుతున్నారు. ప్రైం ప్రాపర్టీస్‌కి చట్టబద్దత హక్కులు లేవని అంటున్నారు. హిబా ఇవ్వాలంటే పొజిషన్ ఉండాలి. కానీ, 1972లో ఇచ్చిన హిబాకు దావా వేసిన నాటికి పొజిషన్ లేదని పత్రాలు చూపిస్తున్నారు.
యూఎల్సీ ఉన్నప్పుడు భాగ్యనగర్ సొసైటీకి ఎలా చెల్లుతుందని వాదన!
1984లో 167 ఎకరాలకు గాను భాగ్యనగర్ సొసైటీ 4 అగ్రిమెంట్లతో భూమి కొనుగోలు చేసింది. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టు ద్వారా చేయించుకున్నారు. యూఎల్సీ ఫోర్స్‌లో ఉన్నప్పుడు ఈ కొనుగోలు వ్యవహారం ఎలా కొనసాగిందో చెప్పాలని, ప్రభుత్వం ఎంట్రీ కావాల్సి ఉండగా ఎప్పుడూ ఈ క్లైం చేసుకోలేదు. 2008 నుంచి యూఎల్సీ ఎత్తి వేశారు. దీంతో అసలైన పట్టాదారుల నుంచి ఇప్పుడు అగ్రిమెంట్లు చేసుకుంటే చెల్లుతుందని బలమైన పేపర్స్ చూపిస్తున్నారు. ఎన్నో చిత్ర విచిత్రాల హసీం అలీలు పుట్టుకొచ్చారు. చనిపోయారు. ఎన్నో స్టేట్మెంట్‌లు ఈ కేసుల్లో రికార్డులు అయ్యాయి.
సుప్రీంకోర్టు నెలకో తీర్పుతో ఆశలు రేకెత్తడం.. చల్లారడం
గోడ కట్టుకోవచ్చు, ఎవ్వరికి టైటిల్ వస్తే వారు డబ్బులు చెల్లించవచ్చని సుప్రీంకోర్టు జూన్‌లో తీర్పు ఇచ్చింది. కానీ, ఈ తీర్పుతో గ్రీన్ కో అండ్ టీం అక్రమంగా అమ్ముకునే అవకాశాలు ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. దీంతో మరో నెల రోజుల్లో సీజే బెంచ్ ముందుకు విచారణ జరగనుంది. అప్పటి వరకు ఆ తీర్పును రీకాల్ చేస్తున్నామని తీర్పును ఇచ్చారు.
మరో నెలలో కింది కోర్టులో జరుగుతున్న టైటిల్ వివరాలు తెలియజేయాలని చెబుతూ, డీమార్కేషన్ కొనసాగించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో రెవెన్యూ వాళ్లు డీమార్కేషన్ చేసి ఇవ్వాలి. కానీ, ఇప్పుడు కొత్తగా చుట్టూ క్లీన్ చేస్తూ, రేకులు పాతేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలిసి స్వేచ్ఛ న్యూస్ అటు వైపుగా వెళ్లగా పనులు జరుగుతున్నాయి.
దీనిపై ఆరా తీస్తే, అనేక కొత్త విషయాలు, కొత్తగా ఇన్వాల్వ్ అయిన వారి గురించి తెలిసింది. ఫార్మా కంపెనీ గెలుస్తుందా? పవర్ ప్రాజెక్ట్స్ గ్రీన్ కో నెగ్గుతుందా? భాగ్యనగర్ సొసైటీ సభ్యులకు టైటిల్ వస్తుందా? ఎవ్వరికి ఎలా సెటిల్మెంట్ చేస్తారు? కాంగ్రెస్ పెద్దలు ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తుండటంతో అత్యంత విలువైన భూమి ఎటు దారి తీస్తుందోనని ఆసక్తి నెలకొంది.


