National

National : వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న అక్టోబర్ నెల!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

వినియోగదారులకు అక్టోబర్ నెల షాక్ ఇవ్వనుంది. మేజర్ హిందూ పండుగలు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. దసరా, దీపావళికి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు షాక్ తగలనుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు సుమారు 5–8 శాతం, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

వినియోగదారులకు అక్టోబర్ నెల షాక్ ఇవ్వనుంది. మేజర్ హిందూ పండుగలు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. దసరా, దీపావళికి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు షాక్ తగలనుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు సుమారు 5–8 శాతం, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాగి, అల్యూమినియం, ఉక్కు, క్రూడ్ డెరివేటివ్స్ ధరలు, ఫ్రైట్ ఖర్చులు, కరెన్సీ మార్పులు ఈ పెంపునకు కారణాలుగా చెబుతున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉండనుంది. టీవీ, ఏసీల తయారీకి ఉపయోగించే ముడిచమురు కొరత, దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులే ఇందుకు కారణమని సమాచారం.

ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రేట్లపై ప్రభావం పడనుంది. దసరా,దీపావళి పండుగల సీజన్‌ వేళ 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌వర్గాలు వెల్లడించాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు అక్టోబర్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో వినియోగదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచించారు.

ఏసీ ధరలు 5-8 శాతం వరకు పెరగొచ్చని తెలుస్తోంది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు సుమారు 3-4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు ఉత్పత్తులపై 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పాత టీవీని మార్చడానికి లేదా ఏసీని అప్‌గ్రేడ్ చేయడానికి దీపావళి అమ్మకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఇది నిజంగానే చేదు వార్త అని చెప్పవచ్చు.

కంపెనీలు కొత్త ధరలు ప్రకటించినా, డీలర్లు/ఈ-కామర్స్ సైట్లలో పాత ఇన్వెంటరీ (స్టాక్) ఉన్నంతవరకు పాత ధరలకే లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే అక్టోబర్ 1 వరకు ఆగకుండా.. పాత స్టాక్ దొరికే ముందే డిస్కౌంట్లలో కొనుగోలు చేయడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.

#electronic items#price hike#october month#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి