Mythri Ravi Shankar: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు, సినీ లవర్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీతో విధ్వంసం క్రియేట్ చేయడం గ్యారెంటీ అనేలా ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ హిట్ కొట్టలేకపోయాడు.
దీంతో, ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. అయితే, గత కొన్నిరోజులుగా ఈ సినిమా షూటింగ్ లో తారక్ గాయపడటం వల్ల అనుకున్న విధంగా షెడ్యూల్ జరగలేదు. దాదాపు, 2 నెలల పాటు షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. అందుకే, రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మేకర్స్ చెప్పిన తేదీకి రిలీజ్ కాకపోవచ్చునని వార్తలు ప్రసారం అవుతున్నాయి.
వాస్తవానికి డ్రాగన్ సినిమాను జూన్ 11, 2027న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఆ ఛాన్స్ లేదనే వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు నిర్మాత మైత్రీ రవిశంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రవిశంకర్, డ్రాగన్ ఖచ్చితంగా జూన్ 11నే రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు.
దీంతో ఇన్ని రోజుల నుంచి నెట్టింట చక్కర్లు కొడుతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ ఫేక్ న్యూస్ కి చెక్ పడింది. ఇక, ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇదే మైత్రీ రవి ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా విషయంలో కూడా అనుకున్న తేదీకే(డిసెంబర్ 3) వస్తుందని చెప్పాడు. కానీ, ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్ పోస్ట్ పోన్ ఆయనే కన్‌ఫర్మ్ చేశాడు. ఇప్పుడు, డ్రాగన్ మూవీ విషయంలో ఇలాంటి ప్రామిస్ చేస్తున్నాడు. మరి, ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటారా లేదా చూడాలి.


