క్రైమ్

Crime : ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)

రచన: Kumar3 నిమిషాల పఠనం

యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఓ బీజేపీ కార్యకర్త దారుణానికి తెగబడ్డాడు. అతన్ని కారుతో ఢీ కొట్టడంతో పాటు కిందపడిపోయిన అతని మీద నుంచి కారు ఎక్కించాడు.చక్రాల కింద సదరు వ్యక్తి ఇరుక్కోగా ఆపకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు.

యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఓ బీజేపీ కార్యకర్త దారుణానికి తెగబడ్డాడు. అతన్ని కారుతో ఢీ కొట్టడంతో పాటు కిందపడిపోయిన అతని మీద నుంచి కారు ఎక్కించాడు.చక్రాల కింద సదరు వ్యక్తి ఇరుక్కోగా ఆపకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉండే స్థానికులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే..విశాల్ శర్మ అనే బీజేపీ కార్యకర్త ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విక్రాంత్ భారతి అనే వ్యక్తి కారుకు డ్యాష్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన విక్రాంత్ భారతి.. కారు దిగి విశాల్ శర్మను వారించాడు.కారు నుంచి కిందకు దిగాలని గొడవ పెట్టుకున్నాడు. శర్మ వాహనానికి అడ్డుగా నిలబడ్డాడు. దీంతో విశాల్ శర్మ అతన్ని కారుతో ఢీకొట్టి తన వాహనం ఎక్కించాడు.

టైర్ల కింద విక్రాంత్ భారతి నలిగిపోతున్నా కారు ఆపకుండా ఈడ్చుకెళ్తూ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో విక్రాంత్ భారతికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. విక్రాంత్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్టు గుర్తించారు.

భారతిని కారుతో ఢీకొట్డంతో పాటు హత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

https://x.com/pulsenewsbreak/status/2096421124078973076?s=20

#car accident#up#crime#bjp cader#swechaanews#video viral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి