సినిమా

Tollywood: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న హీరోలు ఇప్పుడు విలన్స్‌గా మెప్పిస్తున్నారు. హీరోలు మాత్రమే కాదు, కొందరు హీరోయిన్స్ కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. హీరోగా ఫేడవుట్ అయ్యాక సినిమాలు వదిలేసి వ్యాపారం చేసుకోవచ్చు. కొందరు అలా చేస్తున్నారు కూడా. కానీ, సినిమానే ముందు ప్రాధ్యానం. అందుకే, విలన్ పాత్రలంటే కూడా సై అంటున్నారు. కొందరికైతే, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ విలన్ పాత్రలే పాపులారిటీని తెచ్చాయి.

జగపతి బాబు:

శోభన్ బాబు తర్వాత మళ్ళీ జగపతి బాబుకి తెలుగులో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్స్‌తో ఆయన చేసిన ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్‌కి నిర్మాతలు కోట్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఫేడవుట్ అయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ లెజండ్ సినిమాతో విల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ హీరో రేంజ్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. కేవలం విలన్‌గా మాత్రమే కాకుండా డీసెంట్ ఫాదర్ రోల్స్ కూడా చేస్తున్నాడు జగ్గుభాయ్.

శ్రీకాంత్:

ఫ్యామిలీ హీరోలలో శ్రీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. 100 చిత్రాలను చేసిన శ్రీకాంత్..హీరోగా సినిమాలు ఆగిపోయాయి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అఖండ లాంటి సినిమాలో చేసిన విలన్ పాత్ర విపరీతమైన పేరును తెచ్చిపెట్టింది. ఎంతో సెలెక్టివ్‌గా మంచి బలమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా ఫేడవుట్ అయినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

మంచు హీరోలు..ఇప్పుడు విలన్లే:

మంచు ఫ్యామిలీ హీరోలలో సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన..ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన పాత్రలను చేశాడు. రాజకీయాలలోనూ తన సత్తా చాటాడు. అయితే, మోహన్ బాబు జనరేషన్ హీరోలైన చిరంజీవి, ఆ తర్వాత వచ్చిన వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఇంకా హీరోలుగా చేస్తున్నారు. కానీ, మోహన్ బాబు విలన్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం, ది ప్యారడైజ్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, మంచు మనోజ్ కూడా విలన్ పాత్రల్లో మెప్పిస్తున్నాడు. వీరే కాదు, డాక్టర్ రాజశేఖర్..ఆది పినిశెట్టి, తనీష్, నాగార్జున లాంటి క్రేజీ స్టార్స్ కూడా కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ కి సై అంటున్నారు.

#Jagapathi Babu#Mohan Babu#Srikanth#Manchu Manoj
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి