ఏపీ

Tirumala: తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగిపోతున్నాయి. ఉచిత సర్వదర్శనం కోసం విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. క్యూలైన్ వైకుంఠం కాంప్లెక్స్ దాటి, బయట ఉన్న బాట గంగమ్మ గుడి వరకు చేరుకుంది.

నేడు ఉదయం 8 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే రూ. 300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా... టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని తెలిపింది.

ఇక నిన్న శనివారం ఒక్కరోజే ఏకంగా 84,166 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా... 36,673 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 4.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది. అలాగే నిన్న ఒక్కరోజే 4.74 లక్షల శ్రీవారి లడ్డూల విక్రయం జరిగినట్లు అధికారులు వివరించారు.

క్యూలైన్లలో సుదీర్ఘ సమయం నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, టీటీడీ అధికారులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. తిరుమల ప్రయాణానికి సిద్ధమవుతున్న భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు..

#AP News#Tirumala#Thirupathi#Devotees#Srivari Darshanm#rush
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి