సినిమా

Prabhas VS Vishwak Sen: ఒక్కరోజు తేడాతో ఫౌజీ వర్సెస్ లెగసీ!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas VS Vishwak Sen: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి ఫౌజీ. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటుస్తున్న రొమాంటిక్ మూవీ లెగసీ ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్ కాబోతోంది. అంటే, డిసెంబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

ప్రభాస్‌తో విశ్వక్ పోటీ!

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ మీద ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇమాన్వీ హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అవుతుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల, నిర్మాతలు ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ రాబోతున్నాయని ప్రకటించారు. భారీ హైప్ ఉన్న ఫౌజీతో విశ్వక్ సేన్ సినిమా పోటీ అంటే కాస్త షాకింగ్‌గా ఉంది.

ఎలాంటి, అంచనాలైతే లెగసీపై ఇప్పటి వరకూ లేవు. ఒక మీడియం బడ్జెట్ సినిమాను ఏకంగా పాన్ ఇండియా సినిమా..అది కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాతో అంటే మేకర్స్ కి తమ కథ మీద ఎంతో నమ్మకం ఉండి ఉండాలి. లేదంటే ఇంత భారీ చిత్రం మీద పోటీకి తీసుకువచ్చే సాహసం చేయరు. అసలే ఈ మధ్య విశ్వక్‌కి హిట్స్ లేవు. ఇటీవల వచ్చిన ఫంకీ కూడా ఫ్లాప్‌గా మిగిలింది. మరి, ఏ నమ్మకంతో డిసెంబర్ కి వస్తున్నారో అర్థం కావడం లేదు.

భారీ చిత్రాలతో డిసెంబర్ నెల:

రానున్న డిసెంబర్ నెలలో టాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కాగా, నాగార్జున నటిస్తున్న కింగ్ 100 కూడా డిసెంబర్‌కే రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన కూడా ఇదే డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. అలాగే, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ కూడా ఇదే నెలలో రాబోతుంది. మరి, ఇంతటి పోటీలో లెగసీని రిలీజ్ చేయాలనుకోవడం అతిపెద్ద సాహసమే.

#Prbhas#Vishwak Sen#Fauzi#Legacy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి