NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాబోతున్నారా? త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా? అంతేకాదు, తమిళనాట రాజకీయాలలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్ఠిస్తున్న హీరో, సీఎం విజయ్ తరహాలో తారక్ రాజకీయాలవైపు పూర్తిగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం ఇవే వార్తలు అంతటా వైరల్ అవుతున్నాయి.
దీనికి, కారణం ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి పలుచోట్ల ప్రచారంలో పాల్గొనడమే. అప్పుడే ఎమ్మెల్యేగా నిలబడతాడని చెప్పుకున్నారు. కానీ, ఆ సమయంలో ఎన్టీఆర్ కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాడు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్క నాయకులు ఓడిపోయారని నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. దాంతో, ఆయన మళ్ళీ పొలిటికల్‌గా ఏ స్టాండ్ తీసుకోలేదు. అసలు ఆసక్తి చూపించలేదు.
పూర్తిగా సినిమాపైనే దృష్టి సారించారు. పాన్ ఇండియా స్టార్‌గా పాపులారిటీని సాధించుకున్నాడు. అయితే, మళ్ళీ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతుందని..కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చాలామంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. దీంతో, స్వయంగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.
ఇలాంటి తప్పుడు కథనాలపై, ప్రచాలపై వస్తున్న వార్తలను నమ్మవద్దని క్లియర్‌గా తెలిపారు. ఈ మేరకు ఓ నోట్ ని కూడా విడుదల చేశారు. జూలై 18వ తేదీన ఎన్టీఆర్ పేరున తన అభిమాన సంఘం రా ఎన్టీఆర్ (RAW NTR) అనే బృందం మీడియా ప్రెస్ మీట్ ఉంటుందని ఇచ్చిన ప్రకటన తారక్ రాజకీయ రంగ ప్రవేశం కోసం అంటూ వస్తున్నవన్నీ అవాస్తవం అని..అలాంటి విషయం ఏదైనా ఉంటే నేరుగా ఎన్టీఆర్ ప్రకటిస్తాడని లేఖలో తెలిపారు. దీంతో ఇన్నిరోజులు జరిగిన ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.













