సినిమా

Tollywood: అన్నదమ్ములు సెట్ అయ్యారు.. మ‌రి నాగ్ ఎప్పుడు..?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Tollywood: అక్కినేని సామ్రాజ్యానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరాల నాటి చరిత్ర, తిరుగులేని ఆస్తులు, లెజెండరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లో ఒక వెలితి స్పష్టంగా కనిపించింది. వెండితెరను దశాబ్దాల పాటు శాసించిన 'కింగ్' నాగార్జునకు, తన వారసుల కెరీర్ ఒడిదొడుకుల్లో పడటం పెద్ద ఆందోళనగా మారింది.

Tollywood: అక్కినేని సామ్రాజ్యానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరాల నాటి చరిత్ర, తిరుగులేని ఆస్తులు, లెజెండరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లో ఒక వెలితి స్పష్టంగా కనిపించింది. వెండితెరను దశాబ్దాల పాటు శాసించిన 'కింగ్' నాగార్జునకు, తన వారసుల కెరీర్ ఒడిదొడుకుల్లో పడటం పెద్ద ఆందోళనగా మారింది. ఒక పక్క నాగచైతన్య నిలదొక్కుకోవడానికి కష్టపడటం, మరోపక్క అఖిల్ ఎంత ట్రై చేసినా లక్ కలిసిరాకపోవడం నాగ్‌ను తీవ్ర అశాంతికి గురిచేసింది. డబ్బు, హోదా ఎన్ని ఉన్నా కొడుకుల సక్సెస్ కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు కదా. అందుకే, తన స్టార్‌డమ్‌ను కాసేపు పక్కన పెట్టి, ఒక గైడ్‌లా మారి పిల్లల కోసం రంగంలోకి దిగారు నాగ్.

తండ్రి పడ్డ తపన ఊరికే పోలేదు. గడిచిన ఏడాదిన్నర కాలంలో అక్కినేని కాంపౌండ్ ఊపిరి పీల్చుకునేలా క్రేజీ రిజల్ట్స్ వచ్చాయి. చైతన్య ‘తండేల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ వెనుక నాగ్ అండగా నిలబడటమే కాకుండా, అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వచ్చేలా చూశారు. ఇక అఖిల్ విషయానికి వస్తే, ‘లెనిన్’ సినిమా కోసం నాగార్జున హీరోగా కంటే ఎక్కువ కష్టపడ్డారు. మేకింగ్ దగ్గర్నుంచి ప్రమోషన్ల వరకు ప్రతి ఫ్రేమ్‌ను దగ్గరుండి చూసుకున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం, థియేటర్లలో అఖిల్ భావోద్వేగానికి గురై తండ్రిని హగ్ చేసుకున్న విజువల్స్ అక్కినేని ఫ్యాన్స్‌కు కంటితడి పెట్టించాయి. మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరూ ఇప్పుడు సేఫ్ జోన్‌లోకి వచ్చేసారు.

వారసులు లైన్‌లో పడ్డారు కాబట్టి, ఇప్పుడు అందరి కళ్ళు నాగార్జున పైనే ఉన్నాయి. ఎందుకంటే, నాగ్ ఒక భారీ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో అత్యంత ల్యాండ్‌మార్క్ మూవీ అయిన ‘100వ’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ డైరెక్టర్ రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో నాగ్ స్ట్రాటజీ పూర్తిగా మారింది. ఎలాంటి హడావిడి, లీకులు లేకుండా చాలా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టాకీ పార్ట్ ముగింపు దశకు వచ్చింది.

పిల్లలను సక్సెస్ ట్రాక్‌ ఎక్కించి తండ్రిగా తన బాధ్యతను వంద శాతం నెరవేర్చిన నాగార్జున, ఇప్పుడు హీరోగా తన వందో సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది చివర్లో రాబోతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే.. అక్కినేని ఫ్యామిలీ బాక్సాఫీస్ రేసులో మళ్లీ టాప్‌ గేర్‌లోకి వెళ్లడం ఖాయమ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

#akhil#nagachaithanya#nagarjuna#lenin
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి