తెలంగాణ

KTR: నువ్వు నల్లమల పులి కాదు.. చంద్రబాబు పిల్లి- సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్

రచన: NK•••7 నిమిషాల పఠనం

KTR: సిరిసిల్లలో బహిరంగ సభలో తనను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవలే అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.

KTR: సిరిసిల్లలో బహిరంగ సభలో తనను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవలే అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్నామనే తమపై రేవంత్ రెడ్డికి కోపం అని చెప్పారు కేటీఆర్. సిరిసిల్ల పర్యటనలో రేవంత్ రెడ్డి ఏదైనా కొత్త పథకం ప్రకటిస్తారని అనుకున్నాం.. నాలుగు మంచి మాటలు చెబుతారని.. రైతులకు స్వాంతన కలిగించే ప్రకటన చేస్తారని ఆశించాము.. కానీ అదేమీ లేదు. మళ్లీ అవే తిట్లు, పుక్కిటి పురాణాలు అంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్.

సిరిసిల్ల ఏమైనా శత్రుదేశమా?

సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినట్లు లేదు దండయాత్ర చేసినట్లు ఉందని కేటీఆర్ విమర్శించారు. శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు. సిరిసిల్ల ఏమైనా శత్రుదేశమా? అని రేవంత్ ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెడిసెంట్, ఆరుగురు మంత్రులు, 30మంది ఎమ్మెల్యేలు.. ఇదంతా చూస్తుంటే.. శత్రుదేశం మీద దండయాత్రకు వెళ్లినట్లుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు చంద్రబాబు దగ్గర పిల్లి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సభలో పోలీసులు తప్ప ప్రజలెవరూ లేరని అన్నారు.

4వేల మంది పోలీసులు ఎందుకు

''4వేల మంది పోలీసులను కాపలా పెట్టుకుని వెళ్లావు. నువ్వు నల్లమల పులివా? నువ్వు నల్లమల పులి కాదు చంద్రబాబు దగ్గర పిల్లి. మా వాళ్లందరినీ అరెస్ట్ చేయించావు. ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తే రోడ్డు పక్కన కంకులు కాల్చేవాడు కూడా ఉండొద్దా? అసలు నువ్వు ప్రజల కోసం వచ్చావా? షో పుటప్ చేయడానికి వచ్చావా? సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకోవడానికి వచ్చావా? అసలు ఎందుకొచ్చావు?

ప్రశ్నిస్తున్నామనే మా మీద కోపం

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్లలో 35మంది చేనేత కార్మికులు చనిపోయారు. నిన్నటి పర్యటనలో రేవంత్ రెడ్డి వారి గురించి ఏమైనా చెబుతారని, వారికి 10లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తారని అంతా ఆశించాము. కానీ దాని గురించి రేవంత్ చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతోంది. ప్రజలకు చేసిందేమీ లేదు. మేము ప్రశ్నిస్తున్నామనే రేవంత్ రెడ్డికి మా మీద కోపం'' అని కేటీఆర్ అన్నారు.

మా తాతకు వందల ఎకరాలు ఉన్నాయి

నన్ను మా అయ్య బాగా చదివించాడు. రేవంత్ రెడ్డి చదువుకోలేదు. ఆయన ఒక పెయింటర్. 84లో మొదలు పెట్టి 92వరకు డిగ్రీ చదివారు. 8ఏళ్లు డిగ్రీ చదివిన ఏకైక వ్యక్తి రేవత్ రెడ్డి. 43ఏళ్ల నుంచి కేసీఆర్ ను ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు. 43ఏళ్ల నుంచి ఆయన ఎమ్మెల్యే, మంత్రి, కేంద్రమంత్రి, డిప్యూటీ స్పీకర్, రాష్ట్రంలో మంత్రి. ఆయన కొడుకును నేను. మా తాతకు చింతమడకలో వందల ఎకరాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఆ పేపర్లు పంపిస్తా చూసుకోమని.

రాజకీయం కోసం కాదు ఉద్యోగం కోసమే ఇండియాకొచ్చా

బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ మాకు చెప్పారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే ఆరేళ్లు ఉద్యోగం కూడా చేశాను. నాలుగు పైసలు సంపాదించుకుని ఇండియాకి ఉద్యోగం కోసమే వచ్చాను రాజకీయం కోసం రాలేదు. 2004 సెప్టెంబర్ లో ఇండియా వచ్చాను. 2006లో కరీంనగర్ లో కేసీఆర్ రాజీనామా చేశారు. అప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. కరీంనగర్ లో మళ్లీ గెలిచేందుకు, నాకు చేతనైన ఓట్లు వేయించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను.

రాజకీయాల్లో లేకుంటే 3 కాదు 10హోటళ్లు ఉండేవి

అమెరికాలో సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ పెట్టుకున్నా. అప్పుడు పెట్టిన ఒక హోటల్ ఈ 20ఏళ్లలో పెరిగి మూడు హోటళ్లు అయ్యింది. 2006లో పెడితే 20 ఏళ్లు నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను కానీ పట్టించుకుని ఉంటే, ఈ రాజకీయాల్లో లేకపోయి ఉంటే 10 హోటళ్లు చేస్తుంటి. 2009లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే నా ఆస్తులు, అప్పుల గురించి ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేశాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిందంతా నేను 2009లో అఫిడవిట్ లో రాసిన గురించే చెబుతున్నారు. నువ్వు చెప్పేది ఏంది? నేనే చెబుతున్నా.. నాకు హోటళ్లు ఉన్నాయి'' అని కేటీఆర్ అన్నారు.

#Ktr#Cm Revanth Reddy#Ktr Hotels#Siricilla#Hyderabad#Brs#Congress#Telangana Politics#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి