తెలంగాణ

El Nino: ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK•••2 నిమిషాల పఠనం

El Nino: రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

El Nino: రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఎల్‌నినో పరిస్థితులు, చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

#El Nino#Telangana Cabinet#Cm Revanth Reddy#Drought#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి