సినిమా

Tollywood: 'ది ప్యారడైజ్' ఫ్లాప్ ఎఫెక్ట్.. మెగాస్టార్‌తో శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు ‘దసరా’తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోవడంతో శ్రీకాంత్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత, ఆయన దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్’పై కూడా మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే, విడుదల తర్వాత సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టు గురించి డిస్కర్షన్స్ మొదలైయ్యాయి.

ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల చేయబోయే సినిమా విషయంలో ఇప్పుడు కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా ఉందా? లేదా? అన్న సందేహాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి, ముఖ్య కారణం పాన్ ఇండియా స్కేల్‌లో వచ్చిన నాని ది ప్యారడైజ్ సినిమా భారీ నష్టాల దిశగా సాగుతోంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్ప కథ-కథనం సినిమాలో ఆశించిన స్థాయిలో లేదని తేల్చేశారు. దీనికి, ప్రధాన కారణం దర్శకుడు అనుభవ లోపం అని చెప్పుకుంటున్నారు.

వాస్తవానికి ముందు నుంచి ‘ది ప్యారడైజ్’ విషయంలో శ్రీకాంత్ ఓదెల చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. సినిమా కోసం భారీ స్కేల్, డిఫరెంట్ వరల్డ్, నాని లుక్ ఇలా ఎన్నో అంశాలు ఆసక్తిని పెంచాయి. కానీ, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడం, అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఆడకపోవడం దర్శకుడి తదుపరి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందా.. అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇక, దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుందని కన్‌ఫర్మ్ చేశారు. ఈ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. శ్రీకాంత్ ఓదెల మాస్ టేకింగ్‌కు చిరంజీవి ఇమేజ్ కలిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఫలితం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా క్యాన్సిల్ అయిందని, ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, ఇది నిజంగా క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తే గానీ తెలియదు.

#Srikanth Odela#Megastar Chiranjeevi#Tollywood#Latest Cinema Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి