తెలంగాణ

TG: ఉద్యోగులకు పండుగ గిఫ్ట్ .. రెండు డీఏల విడుదలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం.. 2024 నుంచి రావాల్సిన బకాయిల్లో రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TG: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం.. 2024 నుంచి రావాల్సిన బకాయిల్లో రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఈ రెండు డీఏల మంజూరు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.2,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే సర్కార్ ఈ ముందడుగు వేసిందని స్పష్టం చేశారు.

కేబినెట్ భేటీలోని ఇతర కీలక నిర్ణయాలు:

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో తెలంగాణలో కరెంట్ వాడకం పెరిగిందని, నిన్న ఒక్కరోజే 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర నిబంధనల ప్రకారం 5,800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని మంత్రిమండలి నిర్ణయించింది. నిన్నటితో వర్షాకాలం ముగిసినట్లు వాతావరణ శాఖ చెప్పిందని, రాష్ట్రంలో సగటున 17 శాతం తక్కువ వర్షపాతం రికార్డయిందన్నారు. 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌నినో ఎఫెక్ట్‌పై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ డిజిటల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ప్రతిష్టాత్మక కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి తొలి దశ కింద రూ.650 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

#Telangana#Telangana Politics#Telangana Cabinet#Revanth Reddy#Government Employees#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి