BhagyaSri Borse: మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటున్న ఆయన.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే ‘ఆపరేషన్ గంగా’. ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. తాజాగా, భాగ్యశ్రీ మోహన్ లాల్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి మంచి క్యాప్షన్ ని జత చేసింది.
భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్. మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత కింగ్డం, ఆంధ్రాకింగ్ తాలూకా, కాంత, లెనిన్ సినిమాలలో నటించి తన గ్లామర్‌తో పాటు నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంంది. ఈ క్రమంలో.. మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా మారనుంది. ‘ఆపరేషన్ గంగా’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇక, నేషనల్ అవార్డు గ్రహీత విష్ణు మోహన్ దర్శకత్వంలో రూపొంతున్న ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ పై అందరిలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే, తాజాగా మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థులు..వారితో పాటు పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన చారిత్రాత్మక 'ఆపరేషన్ గంగ' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 'శ్రీ గోకులం మూవీస్' పతాకంపై గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక, మోహన్ లాల్ సినిమాలకు కేరళతో పాటు తెలుగు, తమిళ, హిందీ మార్కెట్లలోనూ మంచి క్రేజ్ ఉంది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సేకు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు రావడంతో ‘ఆపరేషన్ గంగా’పై దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. సినిమా కథ, మేకింగ్ భారీ స్థాయిలో ఉంటే పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.


