TG: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల సహా ఇన్‌ఛార్జ్ గువ్వల బాలరాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఓటర్ల నమోదును భారీగా పెంచాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, మేధావులు, యువత మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పద్మజ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, అంజయ్య, రాములు,వీర బ్రహ్మచారి, ప్రశాంత్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు రమేష్, యాదయ్య, సంతోష్, జ్యోతి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.


