సినిమా

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. తాజాగా, నాని-రష్మిక మందన్న అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకుంది రష్మిక. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Nani-Rashmika: నాని-రష్మికల వీడియో వైరల్..కాంబో మళ్ళీ ఫిక్సా? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. తాజాగా, నాని-రష్మిక మందన్న అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నానిని హగ్ చేసుకుంది రష్మిక. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మైసా టీజర్:

తాజాగా మైసా టీజర్ రిలీజైంది. రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను నవంబర్ 27న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. దీనిలో భాగంగానే టీజర్‌ను వదిలారు. ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు రష్మికను ప్రశంసిస్తున్నారు. ఖచ్చితంగా, లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న మైసా తో రష్మిక మరోసారి పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. నాని, కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని రష్మికతో చెప్పినట్టుగా సమాచారం.

దేవదాసు సినిమాలో కలిసి నటించిన నాని-రష్మిక:

నాగార్జున, నాని హీరోలుగా వచ్చిన దేవదాసు సినిమాలో నానికి జంటగా నటించింది రష్మిక మందన్న. డెబ్యూ మూవీ ఛలో తర్వాత వచ్చిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. కాని, రష్మిక-నాని జంట మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో, ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం రష్మికను తీసుకోవాలనుకున్నారు. కానీ, సాయి పల్లవి ఫైనల్ అయింది. అలా, రెండవసారి ఛాన్స్ మిస్ అయింది.

ప్యారడైజ్‌లో కూడా రష్మిక:

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసింది. అయితే, ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు హీరోయిన్‌గా పలువురు పేర్లను అనుకున్నారు. ఆ లిస్ట్‌లో రష్మిక పేరు కూడా ఉంది. కానీ, రెమ్యునరేషన్ తో పాటు రష్మిక వరుస ప్రాజెక్ట్స్‌తో లాకవడం వల్ల డేట్స్ కుదరలేదట. అందుకే, కయాదు లోహర్ ఫైనలైంది. కానీ, నాని ఇప్పుడు మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. కాబట్టి, రష్మికను ఏదో ఒక ప్రాజెక్ట్‌లో తీసుకునే అవకాశం మాత్రం లేకపోలేదు. మరి, అభిమానుల కోరిక మేరకు ఈ జంట కలిసి సినిమా చేస్తుందా లేదా చూడాలి.

#nani#rashmika mandanna#tollywood#mysaa#the paradise
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి