స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ElNinoEffect: ఎల్‌నినోతో గొంతు ఎండనున్న తెలంగాణ!

రచన: Swechaanews Chairman8 నిమిషాల పఠనం

ఎల్ నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతవారణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే అంటూ ప్రచారం చేస్తున్నారు.

  • ఆందోళనే తప్ప ఆచరణ, అవగాహన లేని యంత్రాంగం

  • జూరాల రైతుల ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం

  • 200 టీఎంసీలు ఎటు పోయాయని నిలదీత

  • పోతిరెడ్డిపాడు నుంచి భారీగా తోడుకుపోతున్నఏపీ

  • శ్రీశైలంలో 15 రోజుల్లోనే 30 టీఎంసీల తగ్గుదల.. కనిపించని ఇన్ ఫ్లో

  • ఈ సీజన్‌లో ఇప్పటికే 110 టీఎంసీలు తోడేసిన వైనం

  • తెలంగాణ పవర్ హౌజ్‌కు రోజుకు 41 వేల క్యూసెక్కులు విడుదల అంటూ వార్తలు

  • నాగార్జున సాగర్‌కు ఇన్ ఫ్లో 7 వేల క్యూసెక్కులకు మించడం లేదు

  • దొంగ లెక్కలు, నీళ్లు దోచుకుంటున్న తీరును పట్టించుకోని రేవంత్ సర్కార్

  • హైదరాబాద్‌కు తాగునీటి సమస్య పొంచి ఉన్న తీరుపై,
    కృష్ణా జలాల వాడకం ఎలా ఉందో స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.

ఎల్ నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతవారణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ, రోజుకు 3 టీఎంసీలు తరలించునేంత గండి పెట్టుకున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట, చిత్రావతి లిఫ్ట్, గోరకల్లు పిన్నపురం వెళ్లే ప్రధాన ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించే ఎస్ఆర్బీసీ రిజర్వాయర్లను వాడుకుంటారు. పిన్నపురం వద్ద గ్రీన్ కో 1680 మెగా వాట్ల పీఎస్పీ నిర్మాణం చేసింది. ఇలా 14 హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని డిసెంబర్ లోపే పవర్ సప్లై ఆపివేయాలి.

పొతిరెడ్డిపాడులో ఎన్ని.. ఎలా వాడుతున్నారో తెలియని పరిస్థితి

పేరుకే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటారు. కానీ, బనకచర్ల వరకు దోచుకునిపోతున్నారు. రోజుకు 3 టీఎంసీలు రాత్రికి రాత్రి తరలించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కొండలను తొలచివేసింది అందుకే. అక్కడ నుంచి తెలంగాణకు ఎలాంటి సమాచారం ఉండదు. పేపర్లలో తాగు నీటి అవసరాలని చెప్పుకుంటూ రోజుకు 8 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు చెబుతున్నారు. కానీ, అనధికారికంగా వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేయకపోతే, నీళ్లు లేవని చెబుతూ తెలంగాణకు వచ్చే 1 టీఎంసీ నీళ్లతో తయారు అయ్యే విద్యుత్‌కు కొరత ఏర్పడుతుంది. నీరు మళ్లీ నాగార్జున సాగర్ లోనే కలుస్తుంది. అక్కడ ఏపీకి వాటా ఉంటుంది. అనధికారికంగా పొతిరెడ్డిపాడు నీళ్లే పెన్నాకు వెళ్తాయి. తెలంగాణకు హక్కు లేకుండా పోతుంది. ఫలితంగా హైదరాబాద్‌కు నీటి కష్టాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏటా 30 టీఎంసీలు హైదరాబాద్‌కు అవసరం. కానీ, 20 రోజుల్లోనే నాగార్జున సాగర్‌లో 4 టీఏంసీలు ఖర్చు అయ్యాయి. ఇన్ ఫ్లో లేదు. ఔట్ ఫ్లో నుంచి పులిచింతలకు చేరుకుంటున్నాయి. డబుల్ ఔట్ ఫ్లో కావడం. ఎడమ గట్టులో విద్యుత్ తయారు అధికారికంగా సాగర్ కి చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గేట్ లీకేజీలు లేవు. వరద జలాలు కాకుండా బురద జలాలను సైతం లాగేసుకునే కేపాసిటీ పొతిరెడ్డి పాడుకు ఉంది. అందుకే గ్రావిటీ మీద నీళ్లను దోచుకుంటున్నారు. ఆనాడు ఈ కాంట్రాక్ట్ చేసింది ఏపీలో ఓ జిల్లాకు చెందిన మంత్రి బ్రదర్స్‌యే.

జూరాల లొల్లి

రైతులు జూరాల నిండిందని పంటలు వేసుకున్నారు. అక్కడ 12 టీఎంసీల కేపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పంటలకు నీళ్లు వదలడం లేదు. భవిష్యత్ పేరుతో మంచిగా ఆలోచించినా, అది అధికారులకు, రైతులకు అర్ధం అయ్యేలా చెప్పే నాథుడే లేడు. అప్పర్ కృష్ణ, భీమా నుంచి నీళ్లు రావడం లేదు. వీళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రం జూరాల గేట్లను తెరిచి శ్రీశైలంకు వదులుతున్నారు. దీంతో అక్కడి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. నేరుగా వెళ్లి గేట్లు ఎత్తే ప్రయత్నం చేశారంటే వారు ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌కు నీటి కష్టాలు

ఎల్ నినో ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి వరకు కృష్ణా వాటర్ వాడుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత మరో 4 నెలలు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ నీళ్ల వాడకంపై రోజూ రివ్యూలు లేకుంటే హైదరాబాద్ నీళ్ల కోసం జనం ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటికే కరెంట్ కోతలతో సతమతం అవుతుంటే, ఇప్పుడు నీళ్లు కూడా తగ్గిస్తే ప్రభత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక, వర్షాకాలంలోనే హైదరాబాద్ నీటి కష్టాలపై మరో కథనంలో చూద్దాం.

#ElNinoEffect#TelanganaWaterCrisis#Pothireddypadu#KrishnaWaters#JuralaProject#HyderabadWaterShortage#SwechaNews#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి