సినిమా

Megastar Chiranjeevi: ఆ లుక్కే హైలెట్ అవుతుందిగా చిరు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Megastar Chiranjeevi: మెగాస్టార్ లేటెస్ట్ వీడియో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంత స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు అన్నయ్య. దీనికంతటికి కారణం..దర్శకుడు బాబి అంటున్నారు. ఇంతకముందు వాల్తేరు వీరయ్య సినిమాలో ముఠామేస్త్రిని మళ్ళీ రీక్రియేట్ చేసిన బాబీ..ఇప్పుడు ఇంకోలా ప్రజెంట్ చేయబోతున్నాడని తాజా లుక్ చూస్తేనే అర్థమైంది. ఏషియన్ సునీల్ నారంగ్ ఇంటికి విచ్చేసిన మెగాస్టార్ క్యాప్ పెట్టుకొని అదిపోయే లెవల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మెగాస్టార్ మల్టీప్లెక్స్ కన్‌ఫర్మ్ అనడానికి ఇదే ప్రూఫ్:

నిన్నా మొన్నా వార్తల్లో మెగాస్టార్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరవబోతున్నాడని రాసుకొచ్చారు. ఇప్పటికే, అల్లు అర్జున్..విజయ్ దేవరకొండ..రవితేజ..మహేష్ బాబు ఈ బిజినెస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏషియన్ సునీల్‌తో కలిసి చేస్తున్న ఈ ఛైన్ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతోంది. లేటెస్ట్ టెక్నాలజీతో అధునాతన హంగులతో రూపొందుతోన్న మల్టీప్లెక్స్ లకి మంచి ఆదరణ దక్కుతోంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ కూడా ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ రంగంలోకి దిగబోతున్నటు తెలుస్తోంది. ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి కాస్ట్లీ ఏరియాలో ల్యాండ్ కొన్నారని, త్వరలో భూమి పూజ కూడా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను నిజం చేయడానికే అన్నట్టు..సునీల్ ఇంటికి వినాయక చవితి సందర్భంగా విచ్చేశారు మెగాస్టార్. మాంచి రగ్డ్ లుక్ లో క్యాప్ పెట్టుకొని చాలా స్టైలిష్‌గా ఉన్నారు. దీనికి, సంబందించిన వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.

కాకా మూవీతో బాక్సాఫీస్ షేక్:

బాబీ రూపొందిస్తున్న కాకా సినిమాలోనిదే ఈ గెటప్ అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ అన్నయ్యని ఇలా స్టైలిష్ గ్యాంగ్ స్టర్‌గా చూపించనున్నాడని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2027, జనవరి 13న కాకా రిలీజ్ కాబోతోంది. ఇందులో, అనస్వర రాజన్ చిరు కూతురు పాత్రలో నటిస్తోంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

#Megastar Chiranjeevi#Kaaka#Bobby#Asian Sunil#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి