సినిమా

Kayadu Lohar: టీ అందించి, బట్టల షాపులో సేల్స్ గర్ల్..కట్ చేస్తే పాన్ ఇండియా హీరోయిన్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kayadu Lohar: సాధారణంగా హీరోయిన్ అనగానే ఓ మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకొని..ఆ తర్వాత మేకర్స్ కంట్లో పడి..హీరోయిన్‌గా అవకాశాలు అందుకున్నవాళ్ళే అనుకుంటారు. కానీ, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న కయాదు లోహర్ కెరీర్ మాత్రం కష్టాల కడలి నుంచి మొదలైంది. ఆర్ధిక ఇబ్బందుల్లో టీ షాప్‌లో పనిచేయడమే కాకుండా బట్టల షాపులో సేల్స్ గర్ల్‌గాను పనిచేసినట్టుగా తెలిపింది.

బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో కయాదు లోహర్ కి ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉండేవట. ఇంట్లో వాళ్ళకి సహాయం చేయాలని 10వ తరగతి చదువుతున్నప్పుడే టీ షాపులో కొంతకాలం పనిచేసిందట. టీ కప్పులు అందించేదాన్ని అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది. అంతేకాదు, కొన్నాళ్ళు బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా కూడా వర్క్ చేసిందట. ఇక, ఐటీ జాబ్ కూడా చేసినట్టుగా తెలిపిన కయాదు..అక్కడ ఒత్తిడి తట్టుకోలేక మానేసినట్టుగా వెల్లడించింది.

చిన్నతనం నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండటంతో మోడలింగ్ రంగంలోకి వచ్చి అంచలంచలుగా ఎదిగినట్టుగా చెప్పుకొచ్చింది. ఇలా, గుర్తింపు రావడంతో సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం, తెలుగుతో పాటు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల వచ్చిన రెండి సినిమాలలో మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక, త్వరలో కయాదు నటించిన పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ రిలీజ్ కాబోతోంది.

నాని సరసన నటించే ఛాన్స్ రావడం ఒకరకంగా కయాదు అదృష్టమని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాలో ముందు రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆ ఛాన్స్ కయాదు లోహర్‌కి దక్కింది. మొత్తం 7 భాషలలో రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటితే మాత్రం కయాదు కెరీర్ ఎదుగుదలకి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది. చూడాలి, మరి, కయాదు ఆశించిన కెరీర్ ప్యారడైజ్ మూవీతో వస్తుందో లేదో.

#Kayadu Lohar#Nani#The Paradise#Srikanth Odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి