తెలంగాణ

Crime : లవ్ మ్యారేజ్, మంచి ప్యాకేజీలు, కవలపిల్లలు..అయినా ఘోరం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఏపీకి చెందిన యువతి హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఏపీకి చెందిన యువతి హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలీదు కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్దలు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

వివరాల్లోకివెళితే.. విశాఖపట్నంకు చెందిన రమాకాంత్, శ్రీకాకుళంకు చెందిన మౌనిక సంతోషి (28) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ – ఘట్‌కేసర్ ప్రాంతం పోచారం డివిజన్‌లోని గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు.

ఈ దంపతులకు రెండున్నరేండ్ల వయస్సున్న ఇద్దరు కవలపిల్లలు ఉన్నారు. పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్న మౌనిక దాంపత్య జీవితం పిల్లలు పుట్టేంత వరకు బాగానే సాగిందని తెలుస్తోంది. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది.ఆదివారం ఎప్పటిలాగే పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా.. మౌనిక ఆత్మహత్యకు పాల్పడి విగతజీవిగా కనిపించినట్టు సమాచారం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. చిన్నారుల విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇరుపొరుగు సమాచారం అందించినట్టు వెల్లడించారు. శనివారం రాత్రి కూడా ఇదే అంశంపై దంపతుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మౌనిక మృతితో రెండున్నరేళ్ల కవలలు అనాథలుగా మారారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

#suicide#women#love marriage#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి