ఏపీ

AP: 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఆదేశాలు జారీ చేసిన హోంశాఖ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. పరిపాలనా సౌలభ్యం, పోలీసు శాఖలో సమర్థతను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం శుక్రవారం 9 మంది ఐపీఎస్ అధికారులను వివిధ కీలక స్థానాలకు బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

 ఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. పరిపాలనా సౌలభ్యం, పోలీసు శాఖలో సమర్థతను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం శుక్రవారం 9 మంది ఐపీఎస్ అధికారులను వివిధ కీలక స్థానాలకు బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సీనియర్ అధికారులకు ప్రాధాన్యత కలిగిన విభాగాల బాధ్యతలతో పాటు పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించడం ఈ బదిలీల ప్రక్రియలో ప్రధానంగా కనిపిస్తోంది.

 ఈ మార్పుల్లో భాగంగా ఎస్పీఎఫ్ (SPF) డీజీగా పనిచేస్తున్న సీహెచ్ త్రివిక్రమ వర్మను ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా నియామకం చేసింది. అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు. ఇక ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బాధ్యతల్లో ఉన్న బి.రాజకుమారిని రైల్వే ఐజీగా బదిలీ చేయడమే కాకుండా, ఆమెకు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 సుదీర్ఘకాలంగా పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న అధికారులకు సైతం ఈ బదిలీల్లో తగిన ప్రాధాన్యత లభించింది. కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా, విశాల్ గున్నిని ట్రైనింగ్ డీఐజీగా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు గ్రేహౌండ్స్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న బాబూజీ అట్టాడను పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను కేటాయించారు.

 జిల్లాల స్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యమిస్తూ ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులకు స్థానచలనం కలిగించారు. పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం ఎస్పీగా, సీఎంఎస్‌జీ ఎస్పీగా సేవలు అందిస్తున్న జగదీశ్ అదహళ్లిని పల్నాడు ఎస్పీగా బదిలీ చేశారు. అదేవిధంగా సీఐడీ ఎస్పీగా ఉన్న కే.చక్రవర్తిని పోలవరం ఎస్పీగా నియమిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

#APIPSTransfers#APSocialNews#AmaravatiNews#APPolice#IPSPostings#APGovernment#APNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి