సినిమా

George Krish: జూనియర్ సైంటిస్ట్ గా శర్వానంద్.!

రచన: Anshu4 నిమిషాల పఠనం

George Krish: ఆగడు తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఇందులో హీరోగా శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడట. ఇదే, నిజమైతే..శర్వాకి మంచి పాత్ర దక్కినట్టే అని చెప్పాలి.

శ్రీను వైట్ల కూడా చాలా ఏళ్ళ నుంచి సాలీడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. మధ్యలో మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఒక సినిమా చేసినప్పటికీ, అది ఎవరికీ గుర్తు కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత, శ్రీను వైట్ల-మంచి విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఢీ కి సీక్వెల్‌ను ప్రకటించారు. ఎందుకనో, ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు.

దాంతో, ఫైనల్‌గా శర్వానంద్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశాడు శ్రీను. ఇక, ఈ సినిమాలో శర్వా పాత్ర చుట్టూ కథ తిరుగుతూ మంచి డ్రామాతో పాటు కామెడీ హైలెట్‌గా ఉంటుందట. శ్రీను వైట్ల సినిమాలలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. శర్వాకి మంచి కామెడీ టైమింగ్ ఉంది. కాబట్టి, వీరి కాంబోలో రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ గ్యారెంటీగా మంచి హిట్ సినిమాగా నిలుస్తుందంటున్నారు.

సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయట. ఇక, ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి మొదలుకానుందని సమాచారం. కాగా, ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి రక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముందు, భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రియ భవానీ శంకర్ పేరు వినిపించింది. మరి, ఫైనల్‌గా ఈ మూవీలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక, ఇప్పటికే బిజినెస్ కూడా పూర్తి చేసిన మేకర్స్ 2027, జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు.

#George Krish#Sharwanand#Srinu Vaitla#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి