Trivikram: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అటు నిర్మాణంలోనూ ఇటు డిస్ట్రిబ్యూషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ మిగతా వారికి గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా వెలిగిన ఆయనకి ఈ మధ్య చాలా సినిమాలు దక్కడం లేదు. నిర్మాతగా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి బిగ్ స్టార్ అంతగా ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే మైత్రీ వారికి ‘ఆదర్శ కుటుంబం’ హక్కులు దక్కాయి.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో వెంకీ సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అవైటెడ్ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో సినిమాపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.
గాంధీ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 2న భారీ స్థాయిలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై బాగానే బజ్ క్రియేట్ అయింది. అయితే, నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను వదిలారు. అలాగే, తెలంగాణలో ఎల్ ఎల్ పి వారు కూడా విడుదల చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు.

హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి థ్రిల్లర్ నేపథ్యం కూడా జత చేసి దర్శక-రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా మలిచినట్టుగా చెప్పుకుంటున్నారు. వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ పంచ్ డైలాగులతో సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించడం గ్యారెంటీ అని ఇటీవల వచ్చిన టీజర్‌తో అర్థమైంది. దొరికిన చోటల్లా అప్పులు చేసే భార్యగా శ్రీనిధి శెట్టి పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలవనుంది.










