తెలంగాణ

HYD : చిన్నారిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి.. ఎందుకంటే?

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించింది. ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసి వెళ్లిపోయింది.అయితే, బాధిత చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని సమాచారం.

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించింది. ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసి వెళ్లిపోయింది.అయితే, బాధిత చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని సమాచారం. వైద్యం చేయించడానికి డబ్బులు లేక, సాయం చేసేవారు రాక నిస్సహాయత వల్లే ఇలా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకివెళితే..నగరంలోని ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో నివాసం ఉంటున్న షబానాకు ఇద్దరు కూతుళ్లు. తన భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేస్తూ కూతుళ్లను పోషించుకుంటోంది.అయితే, రెండో కూతురు రుక్సానా (6) గత కొంతకాలంగా పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోందని తెలిసింది. వైద్యం చేయించే స్థోమత ఆమెకు లేదు. సాయం కోసం చేతులు చాచినా ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.

కట్టుకున్న వాడు వదిలేసిపోవడంతో ఒంటరైన షబానా.. ఎవరి నుంచి సాయం అందకపోవడంతో చివరకు కన్న బిడ్డను హుస్సేన్ సాగర్‌లో విసిరేసింది. రోజురోజుకూ బిడ్డ అనారోగ్యంతో కుంగిపోవడం చూడలేకనే ఇలా చేసినట్టు తెలుస్తోంది. మనసు చంపుకుని ఓకేసారి బిడ్డను దూరం చేసుకోవాలని ఆ తల్లి భావించినట్టు తెలుస్తోంది.

అయితే, షబానా తన ఆరేళ్ల చిన్నారని హుస్సేన్ సాగర్‌లో విసిరేసి వెళ్లిపోతుండగా.. అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. వెంటనే నీటిలోకి దిగి పాపను రక్షించాడు. స్థానికుల సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారని పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నారిని తిరిగి తల్లి వద్దకు చేర్చనున్నట్టు సమాచారం.

#Babygirl#hyderabad#Hussain Sagar#Mother#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి