తెలంగాణ

ఆదివాసీ భూముల్లో అగ్రి మినిస్టర్ కుట్రలు!

రచన: Swechaanews Chairman••9 నిమిషాల పఠనం

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న 30 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 25 (25-02-2026)న 600 ఇళ్లను కూల్చివేశారు. 2014లోనే పట్టాలు ఇచ్చి, హౌస్ నెంబర్స్‌తో పాటు సీసీ రోడ్లు ఉన్నాయి. అయినా కానీ నకిలీ పట్టాలిచ్చి లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో 10 ఎకరాల్లో నిర్మాణాలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు.

  • దర్జాగా భూములను దున్నేస్తున్న తుమ్మల

  • 1 ఆఫ్ 70 రద్దు చేయాలని కుయుక్తులు?

  • కోర్టులను మేనేజ్ చేయాలంటూ రూ.8 కోట్లు వసూలు చేసిన ముఠా?

  • ప్రభుత్వం తరఫున అనుకూల నివేదికకు ప్రయత్నం

  • లీజుల రూపంలో వేల ఎకరాలు కబ్జాలు?

  • ఆదివాసీల హక్కులను హరించడమే లక్ష్యంగా పావులు

  • ఖమ్మంలో తీవ్రంగా మారుతున్న తుమ్మల తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

  • పాలకులపై భూ ఫైటింగ్ పార్ట్-5

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ చైర్మన్.

వెలుగుమట్లలో మాటేద్దామనుకున్నారు

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న 30 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 25 (25-02-2026)న 600 ఇళ్లను కూల్చివేశారు. 2014లోనే పట్టాలు ఇచ్చి, హౌస్ నెంబర్స్‌తో పాటు సీసీ రోడ్లు ఉన్నాయి. అయినా కానీ నకిలీ పట్టాలిచ్చి లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో 10 ఎకరాల్లో నిర్మాణాలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఎప్పటినుంచో 1 ఆఫ్ 70 రద్దుకు కుట్ర?

పామాయిల్ పంట ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఆదివాసీలకు చెందిన భూములను పెద్ద ఎత్తున లీజులకు తీసుకున్నారు. అందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువులు భద్రాది కొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో 2 వేల ఎకరాలను చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1959 షెడ్యూల్డ్ ప్రాంతాల భూమి బదిలీ నియంత్రణ పేరుతో 1970లో ఓ చట్టం తీసుకొచ్చారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని అమ్మకం, లీజు, బెదిరింపులు ఇలా ఏ రూపంలో కూడా చెల్లదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకే తిరిగి ఇవ్వాలి. కానీ, 12 ఏండ్ల లీజు పేర్లతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని పట్వారి గూడం, జగ్గారం, బలరాజు గూడెం, నాగపల్లి, బెట్టుపల్లి, గండుగులపల్లి, మల్కారం గ్రామంలో మంత్రి బంధువుల పేరిట 35 ఎకరాలు, భార్య పేరిట 40 ఎకరాలు, అల్లుడు కొప్పుల రాకేష్‌కు లింక్ అయిన 44 ఎకరాలు ఉన్నాయి. తుమ్మల బ్రదర్ చెన్నారావు పేరు మీద కూడా భూములు ఉన్నాయి. కత్రగడ్డ నిరంజన్, రవిరాజా, వెంకయ్య, ప్రసాద్, తుమ్మల వాణి, భగవాన్ అనే కార్యకర్తల పేర్లతో కనిపిస్తున్నాయి.

ఆదాయం లక్షల్లో.. లీజు వెయ్యి రూపాయలే?

లాభసాటి పంటగా ఉండే పామాయిల్ పండితున్న భూముల్లో ఎకరానికి 500 నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పట్వారి గూడెం, జగ్గారం, బలరాజు గూడెంలో 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ ఉంది. పొలాల మధ్యలోంచి రోడ్డు వేయడంతో గిరజనేతర ల్యాండ్స్ అన్నింటిని కొట్టేయాలని చూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ అంటూనే కోర్టులో 1 ఆఫ్ 70 రద్దుకు కుట్రలు.. 8 కోట్ల వసూలు కథ

సుప్రీంకోర్టులో 16 వందల మంది రైతుల పేరుతో పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రంశెట్టి సత్యనారాయణ అనే 4 ఎకరాల రైతు పిటిషన్ వేయడం వెనుక ఆలపాటి ప్రసాద్ అనే వ్యక్తి రూ.8 కోట్ల వరకు వసూలు చేశారు. ఇలాంటి కుట్రలు 1990 నుంచే జరిగాయని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చేందుకు ధర్నాలు ప్రారంభిస్తున్నారు. పామ్ ఆయిల్ సాగు గేమ్ చేంజర్ అని చెప్పిన మంత్రి తుమ్మల పెద్ద ఎత్తున భూములను లీగల్‌గా కొల్లగొట్టేందుకు, న్యాయస్థానాల్లో న్యాయవాదులకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లించి, సాగు చేసే భూముల్లో, లీజు ఇచ్చినందున రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. డబ్ల్యూపీ నెంబర్ 696/2026 లో 1,672 మంది గిరిజనేతరులు ఉన్నారని చెబుతునారు. రెగ్యులేషన్ 1/70 లో సెక్షన్ 3(1)(ఏ), రాజ్యాంగంలోని 14, 19, 21, 300 ఏ అధికరణలకు విరుద్ధమని, మారిన పరిస్థితుల్లో పునఃపరిశీలించాలని కోరుతున్నారు. రెండో కేసు సివిల్ అప్పీల్ నెంబర్ 394/2023. పిటిషనర్ సూరిరెడ్డి రమణా రెడ్డి. ఈ అప్పీల్ కూడా సెక్షన్ 3(1)(ఏ)ను ప్రశ్నిస్తోంది. రద్దయిన ఆర్టికల్ 19(1)(ఎఫ్)ను ఆధారంగా చూపుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దీనిపై 2,500 మంది షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వర్ష రాంబాబు, ఆధార్ సొసైటీ సభ్యులు కలిసి ఉన్నారు. న్యాయవాది అల్లంకి రమేష్ గిరిజనుల తరుఫున ఫైట్ చేస్తున్నారు. 1/70 రాజ్యాంగబద్ధమని, డబ్ల్యూపీ 696/2026, సీఏ 394/2023ను కొట్టివేయాలని, పీ రామిరెడ్డి తీర్పు(1988) 3 సెక్షన్ 433 మార్గదర్శకాలు అమలు కావాలని, 1970 తర్వాత వలస వచ్చిన గిరిజనేతరులు, వడ్డీ వ్యాపారులు పట్టా, అసైన్డ్, మిగులు భూములు ఆక్రమించారని ఆధారాలు చూపిస్తున్నారు. అయితే, కేసులను తిమ్మిని బమ్మిని చేయడానికి రూ.10 కోట్లు రైతుల వద్ద నుంచి వసూలు చేసుకున్నారు.

ఆదివాసీల భూములు అప్పగించకపోతే.. గతంలో చేసిన స్కాములన్నీ ప్రజల ముందు ఎండగట్టుడే?

జూన్ 2026లో మంత్రి కుమారుడు స్లిపింగ్ పార్టనర్ ఉన్న కంపెనీకి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అంటూ 72 ఎకరాలు 25 శాతం ధరకే కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ నెక్ట్స్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేబినేట్ ఆమోదం లేకుండానే, కేంద్ర నిధులతో అభివృద్ది చేసిన భూమిని 21 లక్షలకు కేటాయించారు. టీజీఐఐసీ నిర్ణయించిన ధర 40.47 లక్షలు, మార్కెట్‌లో ఈ భూమి ధర 80 లక్షలకు పైగానే ఉంటుంది. 2008లో రైతుల వద్ద నుంచి సేకరించిన ఈ 203 ఎకరాల్లో ఫుడ్ పార్క్‌ ఏర్పాటు చేశారు. ఎవరు రాలేదనే పేరుతో తప్పించుకున్న తుమ్మల వర్గీయుల వెర్షన్ ఉంది. అయితే, 3 వేల ఉద్యోగాలు ఇస్తారా? ఆ భూములపై లోన్స్ తీసుకుని నిధులు మళ్లిస్తారా అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. పెట్టుబడులకు ఈ భూమిని వాడుకుని డబ్బులు దోచుకునే ప్రయత్నంగా స్థానికులు భావిస్తున్నారు. ఎవైతే ఆయన ఉండవని అంటున్నారో అదే దందాను కొనసాగింపునకు ప్రొత్సహిస్తుంటారని విమర్శలు ఉన్నాయి. అక్రమ గనుల తవ్వకాలు చేయవద్దని ఆదేశించారు. అవే జరుగుతున్నాయి. గంజాయి అక్కడి నుంచే సప్లై అయివుతందనే విమర్శలు ఉన్నాయి. భూ కబ్జా ఉండవని చెబుతూనే దమ్మపేట పెద్దగొల్ల గూడెం సర్వే నెం. 385/54లో 5 ఎకరాల నకిలీ వారసత్వంగా ఇచ్చారు. దీనికి ఒక్క అధికారినే సస్పెండ్ చేశారు.

#TummalaNageswaraRao#AgencyLandsControversy#1of70Act#KhammamPolitics#BhadradriKothagudem#TelanganaNews#SwechaNewsExpose
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి