సినిమా

Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది! అంటూ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది. దీనికి కారణం నందమూరి మూడవ తరం వారసుడి ఎంట్రీ అంటే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సినీ ప్రేక్షకుల్లో, సినీ వర్గాలలో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఇలాంటి అంచనాల మధ్య మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఏమాత్రం ట్రాక్ రికార్డ్ లేని మల్లిడి వశిష్ట దర్శకుడంటే రాంగ్ ఛాయిస్ అని వినిపిస్తోంది.

మైత్రీ మూవీస్‌పై పెద్ద బాధ్యత:

నందమూరి వారసుడిని వెండితెరకి పరిచయం చేసే అతిపెద్ద బాధ్యత అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ మీద పడింది. ఇప్పుడు, తెలుగులో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది మైత్రీ. ఇటీవల రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో ఊహించని ఘన విజయాన్ని అందుకొని ఫుల్ ఫాంలో ఉన్నారు. వీరి ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ అంటే అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది..సందేహమే లేదు.

దర్శకుడి విషయంలో బాలయ్య నిర్ణయం కరెక్టేనా?

గత నాలుగైదేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని అభిమానులను ఊరిస్తూ వచ్చారు. ఒకదశలో అంతా మర్చిపోయారు కూడా..నందమూరి వారసుడి ఎంట్రీ ఉండదని కూడా ఊహాగానాలు వచ్చాయి. కానీ, సడన్‌గా ప్రాజెక్ట్ ని ప్రకటించి సర్‌ప్రైజ్, షాక్..రెండూ ఒకేసారి ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, కేవలం బింబిసార లాంటి చిత్రాన్ని తీసిన వశిష్టకి బాధ్యతలు అప్పగించడమే సరైన నిర్ణయం కాదంటున్నారు.

మన హీరోలకి మాస్ ఆడియన్స్ ఎక్కువ. మొదటి సినిమాను మంచి మాస్ కథాంశంతో తీస్తే వచ్చే మైలేజ్ వేరే. మరి, బాలయ్య ఎలాంటి కథలో మోక్షజ్ఞ మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో సస్పెన్స్‌గా ఉంది. వాస్తవానికి పూరి జగన్నాధ్ వందకి వంద శాతం కరెక్ట్ ఛాయిస్. బాలయ్యకి పైసా వసూల్‌తో మంచి మాస్ హిట్ ఇచ్చాడు కూడా. గోపీచంద్ మలినేని, వినాయక్, బోయపాటి..వీళ్లంతా మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అంటే పెట్టే ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవల్. ఇంతమందిని కాదని..బాలయ్య వశిష్ట వైపు మొగ్గు చూపడానికి కారణం తెలియాల్సి ఉంది.

#Mokshagna Nandamuri#Balakrishna#Myhtri Movie Makers#Mallidi Vasishtha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి