క్రైమ్

Crime : మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!

రచన: Kumar4 నిమిషాల పఠనం

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత ప్రచారం చేసినా, ఎన్నిసార్లు అవగాహన కల్పించినా పేరెంట్స్ చెవికెక్కడం లేదని తెలుస్తోంది. తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు వాహనాలు బయటకు తీసుకుని రావడం, రోడ్డెక్కి యాక్సిడెంట్స్ చేయడం పరిపాటిగా మారింది.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత ప్రచారం చేసినా, ఎన్నిసార్లు అవగాహన కల్పించినా పేరెంట్స్ చెవికెక్కడం లేదని తెలుస్తోంది. తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు వాహనాలు బయటకు తీసుకుని రావడం, రోడ్డెక్కి యాక్సిడెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల మైనర్ వాహనాలు నడపి యాక్సిడెంట్ చేయడం మూలనా పలువురి ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

తాజాగా ఇద్దరు మైనర్ బాలురు స్కూటీని రోడ్డు మీదకు తీసుకుని రావడం, వారి డ్రైవింగ్ మూలనా రెండు కార్లు ఢీకొన్నాయి. ఫలితంగా ఇద్దరు బాలురు రెండు కార్ల మధ్య ఇరుక్కున్న ఘటనలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది.

ఆ సమయంలో మైనర్ వాహనం నడిపినట్టు తెలుస్తోంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలురు 9వ తరగతి చదువుతున్న లోకేశ్, హేమంత్‌గా గుర్తించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదంలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేష్‌కు తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.

ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో స్థానికంగా ఉన్న సీసీ టీవీలో ఈ విజువల్స్ రికార్డు అయ్యాయి. ఓ కారు యూటర్న్ చేసి ముందుకు వెళ్తుండగా.. అదే సమయంలో వెనుకనుంచి మైనర్లు స్కూటీ మీద వస్తున్నారు. వారి వెనుకే వచ్చిన ఓ కారు ముందు స్కూటీని ఢీకొని ఆ తర్వాత కారు ఢీకొట్టడంతో ఆ రెండు వాహనాల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి మైనర్ల అవగాహన లేని డ్రైవింగ్ కారణమని ప్రచారం జరుగుతోంది. సడన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కారు అదుపుతప్పి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.మైనర్‌కు వాహనం ఇచ్చిన పేరెంట్ మీద కూడా కేసు ఫైల్ చేయనున్నట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2096105634148307147?s=20

#minor#scooty drive#accident#kamareddy#one dead#swechaanews#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి