తెలంగాణ

TG : రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్

రచన: Kumar8 నిమిషాల పఠనం

రెండేళ్లు సమయం ఇచ్చి సహకరిస్తే.. పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో రాష్ట్ర విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రెండేళ్లు సమయం ఇచ్చి సహకరిస్తే.. పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో రాష్ట్ర విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.శనివారం కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్‌కు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు టైం ఇవ్వండి. ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.రెండేళ్లలో సమస్యలన్నింటినీ మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టంచేశారు.

‘తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఒక రోల్ మాడల్‌గా నిలబెడుదాం.అందుకు కథానాయకులు ఉపాధ్యాయులే. ఇంట్లో సొంత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీ వద్ద చదువుకుంటున్న విద్యార్థుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి.టీచర్లపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రభుత్వ సర్వీసులో మీరు 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

వీధుల్లోకి రావడం మంచిది కాదు..

“ఉపాధ్యాయులే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్త్‌ క నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా.రెండేళ్లు సమయం ఇవ్వండి. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్‌లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి.నన్ను విశ్వసించి సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు.

‘గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విధ్వంసం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేల అడ్మిషన్లు పెరిగాయంటే ఆ గొప్పతనం ఉపాధ్యాయులదే’ అని పేర్కొన్నారు.

https://x.com/TeluguScribe/status/2096131261266096527?s=20

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి వివాదం లేకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేశాం. జీవో 317 కింద తలెత్తిన సమస్యలను పరిష్కరించాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కాదు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి టీచర్లను విదేశాలకు పంపించామన్నారు.

పాలిటెక్నిక్‌పై విషప్రచారం..

“జాతీయ విద్యా విధానంతో విద్యా రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మనం కూడా విధానాలు మార్చుకోవాలి.నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. కాలం తీరిపోయిన విద్యా విధానంతోనే వెళదామా. అప్ డేటెడ్ విద్యా విధానాన్ని అందిపుచ్చుకుందామా? పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేస్తే, ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం వల్ల ఈరోజు ఫలితాలను చూస్తున్నాం.

పాలిటెక్నిక్‌లో రెండేళ్లు థియరీ, మూడో సంవత్సరం కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేసే విధానం తీసుకొస్తున్నాం. ఇంటర్న్‌గా ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలు రూ.9 వేల వరకు స్టయిఫండ్ కూడా ఇస్తాయి. పాలిటెక్నిక్ ఇప్పటివరకు డిప్లమాలే జారీ చేస్తున్నాయి. విదేశాల్లో మాస్టర్స్ చదువుకోవడానికి వీలుగా డిగ్రీ పట్టాను అందించే విధంగా మార్పులు చేశాం. పాలిటెక్నిక్ పూర్తి చేస్తే ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి అవకాశం కోల్పోతామన్న తప్పుడు ప్రచారంపై విద్యార్థులు మోసపోవద్దు. నిస్సందేహంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి వీలుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ధోకా ఉండదని, సర్వీస్ రూల్స్ వేరు, విద్య విధానం వేరని, ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడాలని కోరారు. ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది అని సీఎం స్పష్టంచేశారు.

https://x.com/TeluguScribe/status/2096135048106025354?s=20

#cm revanthreddy#teachers#polytechnic students#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి